Home /News /telangana /

CM KCR TO MEET MINISTER TODAY IN PRAGATHI BHAWAN TO DISCUSS ON PRESIDENT ELECTIONS SK

CM KCR: ఇవాళ సాయంత్రం మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ.. దాని గురించే చర్చ

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

CM KCR: రాష్ట్రపతి ఎన్నికలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై నేతలతో చర్చించనున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అశకాశముంది.

    ప్రగతిభవన్‌లో ఇవాళ కీలక భేటీ జరగనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై వారితో చర్చించనున్నారు. గురువారం రాష్ట్రపతి ఎన్నికల (President Elections)కు సంబంధించి గురువారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికపైనా సమావేశంలో చర్చించే అవకాశముంది. సీఎం కేసీఆర్ కొంత కాలంగా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అన్ని అంశాల్లోనూ విఫలమైందని దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రధాన నేతలతోనూ సీఎం కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై నేతలతో చర్చించనున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అశకాశముంది.

    తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. మరో 6 నెలల్లోనే అసెంబ్లీ రద్దు.. సీనియర్ నేత సంచలనం

    రాష్ట్రపతిని చట్ట సభల సభ్యులు ఎన్నుకుంటారు. అంటే లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. మన దేశంలో లోక్‌సభ ఎంపీలు 543, రాజ్యసభ సభ్యులు 233 కలుపుకొని.. మొత్తం 776 ఎంపీలు ఉన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 4,033 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎంపీ ఓటు విలువ 700గా.. ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది లోక్ సభ ఎంపీ, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఈ లెక్క తెలంగాణ నుంచి పోలయ్యే మొత్తం ఓట్ల విలువ 32,508. ఇందులో టీఆర్ఎస్‌దే 76 శాతం ఉంది. ఈ ఓట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి పడతాయన్నది హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువైపు ఉండాలన్న దానిపై ఇవాళ మంత్రులకు సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశముంది.



    రాష్ట్రపతి ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికలకు(Presidential Elections) సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 29న నామినేషన్ దాఖలకు తుది గడువు కాగా.. జులై 2న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని ఈసీ(Election Commission Of India) వెల్లడించింది. జులై 18 ఎన్నికలు జరుగుతాయి. జులై 21న కౌంటింగ్ నిర్వహిస్తారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో(Secret Ballot Voting) రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. ఓటింగ్ ప్రక్రియలో ఎన్నికల అధికారులు ఇచ్చే పెన్నును మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఈ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ ఎంపీ, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకూడదని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో..ఈసారి ఈ అత్యున్నత పదవి ఎవరిని వరిస్తుందన్నది హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు