గవర్నర్‌ను కలవనున్న సీఎం కేసీఆర్.. వీటిపై కీలక చర్చ..

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, సచివాలయం కూల్చివేత అంశాలపై సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళి సైతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 20, 2020, 12:41 PM IST
గవర్నర్‌ను కలవనున్న సీఎం కేసీఆర్.. వీటిపై కీలక చర్చ..
తమిళిసై, కేసీఆర్
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ మరికాసేపట్లో రాష్ట్ర గవర్నర్ తమిళి సైతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, సచివాలయం కూల్చివేత అంశాలపై సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళి సైతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై సీఎం కేసీఆర్ తమిళిసైకు వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులు, ప్రభుత్వం నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సచివాలయ కూల్చివేతను దాదాపుగా పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం... త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణంపై కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అంతకుముందే ఈ అంశంపై సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలిసి చర్చించనున్నారని తెలుస్తోంది.

అయితే కొద్దిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై నిర్వహించాలని భావించిన కరోనా సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరిగిపోయిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైను కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Published by: Kishore Akkaladevi
First published: July 20, 2020, 12:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading