తెలంగాణ జల పండుగ.. నేడే ‘కొండ పోచమ్మ’ ప్రారంభం..

తెలంగాణలో నేడు జల పండుగ జరగనుంది. కొండ పోచమ్మ సాగర్‌కు గోదావరి జలాల ఎత్తిపోతకు రంగం సిద్ధమైంది. మర్కూక్ పంప్‌హౌజ్‌లో మోటార్లు ఆన్ చేయడం ద్వారా ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: May 29, 2020, 6:49 AM IST
తెలంగాణ జల పండుగ.. నేడే ‘కొండ పోచమ్మ’ ప్రారంభం..
నేడే ‘కొండపోచమ్మ’ ప్రారంభం
  • Share this:
తెలంగాణలో నేడు జల పండుగ జరగనుంది. కొండ పోచమ్మ సాగర్‌కు గోదావరి జలాల ఎత్తిపోతకు రంగం సిద్ధమైంది. మర్కూక్ పంప్‌హౌజ్‌లో మోటార్లు ఆన్ చేయడం ద్వారా ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే, ఉదయం వేకువ జామున 4:30 గంటలకు చండీయాగం ప్రారంభమైంది. కాసేపట్లో సీఎం కేసీఆర్ సతీ సమేతంగా అక్కడికి చేరుకుని అమ్మవారికి జరిపే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, పూర్ణాహుతి నిర్వహించి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 9.35 గంటలకు ఎర్రవల్లిలో రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఉదయం 9.40 గంటలకు మర్కుక్‌లోని రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 9.50 నిమిషాలకు సీఎం మర్కుక్‌ పంప్‌ హౌస్‌ చేరుకుంటారు. త్రిదండి చినజీయర్‌ స్వామి వారి వద్దకు 10 గంటల సమయంలో సీఎం చేరుకుంటారు.

త్రిదండి చినజీయర్‌ స్వామిని సీఎం కలిసి మర్కుక్‌ పంప్‌ హౌస్‌ వద్ద సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొంటారు. సుదర్శన హోమం, పూర్ణాహుతి ముగిసిన తర్వాత 11.30 గంటల సమయంలో పంప్‌ హౌస్‌ను సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత చినజీయర్‌ స్వామితో కలిసి కొండ పోచమ్మ సాగర్‌ కట్ట మీద డెలివరీ సిస్టమ్‌ దగ్గరకు చేరుకుంటారు. 11.35 గంటలకు డెలివరీ సిస్టమ్‌ దగ్గర గోదావరి జలాలను స్వాగతిస్తూ.. ప్రత్యేక పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కొండ పోచమ్మ డెలివరీ సిస్టమ్‌ నుంచి బయలుదేరి వరదరాజుపూర్‌ గ్రామంలోని వరద రాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తారు. 12.40 గంటలకు వరదరాజు పూర్‌ నుంచి బయలుదేరి మర్కుక్‌ పంప్‌ హౌస్‌ దగ్గరకు సీఎం చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 29, 2020, 6:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading