సాగునీటి వసతి పెరుగుతున్నందున రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పంటల విస్తీర్ణం, దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గోదాములు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు అవసరమైన విధానం ఖరారు చేయాలని చెప్పారు. జూన్ నెలకు సంబంధించిన ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నందున రైతులు వాటిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మే వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సిఎం హెచ్చరించారు. యాసంగి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లు, ఎరువుల లభ్యత, గోదాములు- రైతు వేదికల నిర్మాణం, పంటలకు మద్దతు ధర రాబట్టే విధానం, పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, రైతుబంధు సమతిలను క్రియాశీలం చేయడం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహా పలువురు ఈ ఇందులో పాల్గొన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.