ఫోటోలకు ఫోజులొద్దు... పని చేయండి... సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదని సీఎం కేసీఆర్ నేతలకు హితవు పలికారు.

news18-telugu
Updated: February 18, 2020, 6:06 PM IST
ఫోటోలకు ఫోజులొద్దు... పని చేయండి... సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
  • Share this:
మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారిందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ చెడ్డపేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. పట్టణ ప్రగతిపై నిర్వహించిన సదస్సులో భాగంగా మేయర్లు, ఛైర్‌ పర్సన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి రహిత వ్యవస్ధ ఉండాలి,పట్టణ ప్రగతి ప్రణాళికాబద్ధంగా ఉండాలని అన్నారు. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలని సీఎం సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో అనుకున్నవిధంగా పట్టణాలను తీర్చిదిద్దాలని... ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి పనులుచేయడం పై దృష్టిపెట్టాలని వ్యాఖ్యానించారు. సరిగ్గా అనుకుని ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారిన పడతాయని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయని... మన పట్టణాలను మనమే మార్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో విజయాన్ని సాధించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయని అన్నారు. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నవని, ప్రజా నాయకులుగా ఎదిగితే అది జీవితానికి మంచి సాఫల్యమని సీఎం కేసీఆర్ అన్నారు. అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదని పేర్కొన్నారు. జీవితంలో ఎదిగిన తర్వాత లేని గొప్పదనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దని హితవు పలికారు. 5 కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, ఛైర్‌పర్సన్‌లు అయ్యే అవకాశం వచ్చింది. దీనిని ఒక ముందడుగుగా స్వీకరించి సానుకూలంగా మార్చుకోవాలని సూచించారు.


First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు