హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: ఏమన్నా స్పీచా ఇది.. సీఎం కేసీఆర్ స్పీచ్‌కు ఆ ఊరోళ్లంతా ఫిదా... చూసి తీరాల్సిందే..

KCR: ఏమన్నా స్పీచా ఇది.. సీఎం కేసీఆర్ స్పీచ్‌కు ఆ ఊరోళ్లంతా ఫిదా... చూసి తీరాల్సిందే..

  వాసాలమర్రి: యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతను కేసీఆర్ భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మొత్తం 23 రకాల వంటకాలతో వెజ్, నాన్‌వెజ్ కూరలతో గ్రామస్తులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం.. ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ఎత్తేయగానే మీ ఊరు వచ్చానని, మరో 20 సార్లు వస్తానని గ్రామస్తులకు చెప్పారు. వాసాలమర్రి రూపురేఖలు మారాలని, వాసాలమర్రిలో అభివృద్ధి పనులు జరగాలని సీఎం గ్రామస్తులకు చెప్పారు. ఏడాది నాటికి బంగారు వాసాలమర్రి కావాలని, గ్రామంలో కేసులు ఉండొద్దని కేసీఆర్ గ్రామస్తులకు సూచించారు. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని, సీఎం మీతో ఉంటే జరగని పని ఇంకేం ఉంటుందని గ్రామస్తుల్లో భరోసా నింపారు. అంకాపూర్‌కు వాసాలమర్రి నుంచి కొందరు వెళ్లి చూసి వచ్చారని, అక్కడ బంగారు భూమి ఏమీ లేదని.. వాసాలమర్రిలో ఏం భూమి ఉందో.. అక్కడ కూడా అదే భూమి ఉందని ఆయన చెప్పారు. కానీ.. అంకాపూర్‌లో బిల్డింగ్‌లు ఎలా ఉన్నాయని కేసీఆర్ అడిగారు. ఆ గ్రామంలో ఉంది కూడా రైతులేనని.. ఆ గ్రామస్తులంతా సమిష్టిగా అంకాపూర్‌ను అభివృద్ధి చేసుకున్నారని.. అందుకోసం గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకున్నారని సీఎం చెప్పారు. అంకాపూర్‌లో గ్రామాభివృద్ధి కమిటీనే సుప్రీం కోర్టని, ఆ కమిటీలో ఎవరైనా తప్పు చేసినా జరిమానా తప్పదని ఆయన తెలిపారు. జరిమానా కూడా రెండుమూడు లక్షలు ఉంటుందని కేసీఆర్ చెప్పారు.

  గ్రామాభివృద్ధి జరగాలంటే మహిళలు ముందుకు రావాలని.. మీరు పట్టుబట్టి ఆలోచన చేస్తేనే ఊరు బాగుపడుతుందని సీఎం కేసీఆర్ వాసాలమర్రి మహిళలతో అన్నారు. ఊరిని బాగుచేసుకునే ఈ మిషన్‌లో పార్టీలు, కులాలు, గొడవలు ఉండకూడదని సీఎం సూచించారు. ఊరిలో ఉన్న 1500 మంది రోజుకు 2 గంటలు పనిచేస్తే ఊరి రూపురేఖలే మారిపోతాయని సీఎం కేసీఆర్ గ్రామస్తులకు చెప్పారు. ఇవాల్టి నుంచి వాసాలమర్రి తన ఊరేనని, వాసాలమర్రిలో కమ్యూనిటీ హాల్ కట్టుకుందామని.. చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా వాసాలమర్రికి వచ్చి పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునేలా కమ్యూనిటీ హాల్‌ను తీర్చిదిద్దుకుందామని సీఎం గ్రామస్తులకు మాటిచ్చారు.


  సీఎం కేసీఆర్ స్పీచ్ వీడియో కోసం  క్లిక్ చేయండి

  వాసాలమర్రి గ్రామంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా తానే చూసుకుంటానని, ఊళ్లో ఉన్న దళితవాడలకు కూడా తాను వెళతానని కేసీఆర్ చెప్పారు. గ్రామానికి చెందిన ఓ టెన్త్ చదివిన యువతి తన దగ్గరకు వచ్చిందని, ఎంబీబీఎస్ చదవాలని ఉందని ఆమె చెప్పిందని సీఎం తెలిపారు. అయితే.. తమ తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువు బంద్ పెట్టమని అంటున్నారని ఆ యువతి తనతో చెప్పినట్లు సీఎం కేసీఆర్ గ్రామస్తులకు చెప్పారు. ఆ అమ్మాయిని తాను చదివిస్తానని, ఆమెను డాక్టర్‌ను చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

  First published:

  Tags: CM KCR

  ఉత్తమ కథలు