Bandi sanjay : దళిత బంధు బ్రేక్‌కు కారణం సీఎం కేసీఆర్.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్..

బండి సంజయ్(ఫైల్ ఫొటో)

Bandi sanjay : హుజూరాబాద్‌లో దళిత బంధు నిలిపివేడానికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ వైఫల్యమేనని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.ఇందుకోసం ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Share this:
    తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధుకు( Dhalita Bandhu ) ఆటంకాలు ఏర్పాడ్డాయి. డబ్బుల ట్రాన్స్‌ఫర్‌ను లబ్ధిదారుల ఖాతాల్లోకి వెల్లకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో ఆ పథకం అమలుకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో దళిత బంధు నిలిపివేడానికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ ( cm kcr failure )వైఫల్యమేనని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( bandi sanjay ) సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.ఇందుకోసం ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ పథకం అమలుకు బ్రేక్‌లు పడేలా ఎన్నికల సంఘానికి అవకాశాలు కల్పించింది సీఎం కేసీఆర్ అని ఫైర్ (fire ) అయ్యారు. కాగా ఎన్నికల కమీషన్ ఈ పథకాన్ని నిలిపివేస్తోందని తెలిసే... సోమవారం దళిత బంధుపై చిలుక పలుకులు పలికారని అన్నారు. కొనసాగుతున్న పథకాలు ఎన్నికల కమీషన్ ఎప్పుడు నిలిపివేయదని ఆయన గుర్తు చేశారు.

    హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమలుకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే... ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ (Election Comission Of India) లేఖ రాసింది. దీంతో ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్‌లో దళితబంధు (Dalita Bandhu) పథకం అమలుకు బ్రేక్ పడనుంది. దళితబంధు పథకంపై ఈసీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు చేసింది. హుజూరాబాద్‌లో మాత్రమే ఈ పథకాన్ని ఆపాలని కోరామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చెందిన పద్మనాభరెడ్డి తెలిపారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు.

    ఇది చదవండి : అమెరికాలో స్కూలు డ్రైవర్ల కొరత.. గంటల లెక్కల్లో జీతాలు...


    ఎన్నికల సమయంలో పథకాలను అమలు చేయడం రాజ్యాంగవిరుద్ధమని తెలిపారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికే దళితబంధు పథకం అమలు చేస్తున్నారని పద్మనాభరెడ్డి అన్నారు. మొదట్లో పథకం అమలు చేసే క్రమంలో నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేస్తామని అన్నారని.. కానీ హుజూరాబాద్‌లో మాత్రం మొత్తం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారని పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దళితబంధు పథకాన్ని నిలిపివేసే విషయంలో ఈసీ కొంత జాప్యం చేసిందని అభిప్రాయపడ్డారు.

    అంతకుముందు దళితబంధు నేడు సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక్క వర్గానికి మాత్రమే ప్రభుత్వం మేలు చేస్తుందనే విధంగా దళితబంధు విషయంలో ప్రచారం చేయొవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు చేయూత ఇచ్చేందుకు దళితబంధు పథకం మొదలుపెట్టామని.. ఇది ఆషామాషీ పథకం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. గొల్ల, కురుమలకు గొర్రెలు ఇచ్చినప్పుడు దళితులు అడ్డు చెప్పలేదని గుర్తు చేసిన సీఎం కేసీఆర్.. వారి కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఎవరూ అడ్డుపడొద్దని సూచించారు.

    ఇది చదవండి : అలసిపోయావు.. నాతో రా అన్నాడు.. ఒక్కసారిగా చెట్ల పొదల్లో తీసుకువెళ్లి ..


    రాబోయే ఏడేళ్లలో తెలంగాణలో ఖర్చు చేయబోయే మొత్తం రూ. 23 లక్షల కోట్లు అని చెప్పిన కేసీఆర్.. అందులో దళితుల కోసం లక్షా 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేమా ? అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు.. దేశంలోని దళితుందరికీ దారి చూపాలని సీఎం కేసీఆర్ అన్నారు.
    Published by:yveerash yveerash
    First published: