హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR on TSRTC | ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరం..

KCR on TSRTC | ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరం..

సీఎం కేసీఆర్ (ఫైల్)

సీఎం కేసీఆర్ (ఫైల్)

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు రేపు విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు.

  తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు రేపు విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ‘ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్‌లో చర్చించాం. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాట నమ్మి పెడదారి పడుతున్నారు. వారు చెడిపోతున్నది, సంస్థను దెబ్బతీసుకుంటున్నది, లేని టెన్షన్‌కు గురవుతున్నది అక్కడే. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత ఆర్టీసీ యూనియన్లదే బాధ్యత.’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కోసం ప్రభుత్వం తరఫున వెంటనే రూ.100 కోట్లు విడుదల చేస్తామన్నారు. అయితే, ఆర్టీసీని బతికించుకోవడానికి చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించారు. కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పును పెంచితే.. ఆర్టీసీకి ఏడాదికి రూ.750 కోట్లు ఆదాయం లభిస్తుందని కేసీఆర్ చెప్పారు. దీని వల్ల సంస్థకు కొంత నష్టం పూడుతుందని చెప్పారు. చార్జీల పెంపు వచ్చే సోమవారం నుంచి అమలవుతుందని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు.

  ‘కొందరు ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటే.. వారిలో నలుగురైదుగురికి కలిపి ఓ రూట్ పర్మిట్ ఇవ్వాలని అనుకున్నా. నేను చెప్పినట్టు వింటే మిమ్మల్ని సింగరేణి తరహాలో తీసుకెళ్తాం. యూనియన్లు లేకపోతే ఎలా అనే అనుమానం వద్దు. డిపోకి ఇద్దరు చొప్పున వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం. దాని బాధ్యతలు మంత్రికి అప్పగిస్తాం. ప్రతినెలా ఆ కౌన్సిల్ ఓ సమావేశం నిర్వహిస్తుంది. యాజమాన్యం వేధించకుండా ఏర్పాట్లు చేస్తాం. యూనియన్ల మాట వింటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే.’ అని కేసీఆర్ ప్రకటించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: CM KCR, TSRTC Strike

  ఉత్తమ కథలు