CM KCR SENSATIONAL COMMENTS ON CITIZENSHIP AMENDMENT BILL SK
CAA రాజ్యాంగ విరుద్ధం.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
సీఎం కేసీఆర్
CAAకి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకొని చట్టాన్ని కొట్టిపారేయాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.
పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. CAAతో దేశానికి మంచిది కాదని.. ఆ చట్టాన్ని తెలంగాణలో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. CAAకి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని చట్టాన్ని కొట్టిపారేయాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. నెల రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో హైదరాబాద్‌లోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాను భయంకరమైన హిందువని..తాను చేసినన్ని యాగాలు దేశంలో ఎవరూ చేయలేదని స్పష్టం చేశారు.
CAA తప్పుడు బిల్లు. ఇది రాజ్యాంగ విరుద్ధం. దేశానికి మంచిది కాదు. మేం వందకు వందశాతం వ్యతిరేకిస్తాం. మేం సెక్యులర్. సెక్యులర్‌గానే ఉంటాం. ఒక వర్గాన్ని పక్కకు పెడతామనడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం. కేంద్రం విజ్ఞతతో విరమించుకోవాలి. ఈ బిల్లుపై పునరాలోచన చేయాలని ప్రధానిని కోరుతున్నా. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని చట్టాన్ని కొట్టిపారేయాలి. దేశం మునిగిపోయే పరిస్థితుల్లో ఉంటే మనం మౌనంగా ఉండడం మంచిది కాదు. త్వరలో సీఏఏని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం.
— సీఎం కేసీఆర్
దేశ సమగ్రత దృష్ట్యా కశ్మీర్‌లోని ఆర్టికల్ 370 రద్దుని తాము సమర్థించామని.. కానీ CAA దేశానికి మంచిది కాదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. భారత దేశం ప్రజల దేశంగా ఉండాలని.. మత దేశంగా ఉండకూదని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.