Home /News /telangana /

CM KCR SAYS HE IS READY TO FORM NEW NATIONAL PARTY TO OUST BJP SLAMS PM MODI COMMENTS ON PRASHANT KISHORE SURVEY MKS

KCR National party: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ సై -Prashant Kishor సర్వేపైనా..

కొత్త పార్టీపై కేసీఆర్

కొత్త పార్టీపై కేసీఆర్

కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీని గద్దె దించడానికి జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు..

దేశానికి కొత్త రాజ్యాంగం అవసరాన్ని మరోసారి గట్టిగా నొక్కి చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీని గద్దె దించే దిశగా కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకూ సై అన్నారు. దేశ ప్రజలంతా కోరితే.. తప్పకుండా జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్‌ వెల్లడించారు. తనకు ఆ దమ్ముందని అవసరం వస్తే తప్పకుండా పార్టీ పెడతానన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. ప్రగతి భవన్ లో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని తెలిపారు. అంతేకాదు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేస్తోన్న తాజా సర్వేపైనా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాడు ఏమన్నారు.. ఇప్పుడు ఏమైంది? ఇది ప్రజాస్వామ్యం.. జనం ప్రభంజనమైననాడు అంతా తలకిందులు అయితది. అంతెందుకు చాయ్‌ అమ్ముకున్నా.. అని మోదీనే చెప్పారు కదా. ఆయన ప్రధాని కాలేదా. సినీ నటులు ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రులయ్యారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ.. ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది'' అని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కంపేనని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం మొత్తం సర్వ నాశనమవుతోందని ఆయన ఆరోపించారు.

New Constitution : కొత్త రాజ్యాంగంపై CM KCR తాజా బాంబు.. దళిత సంఘాలకు సంబంధమేంటి?దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, బీజేపీ పిచ్చి, పచ్చి అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేస్తోందన్నారు కేసీఆర్. బ్యాంకులను లూటీ చేసే ఘోరమైన గజదొంగలను సురక్షితంగా దేశం బయటికి పంపారని ఆరోపించారు. రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలనడం దుర్మార్గమని దుయ్యబట్టారు. విద్యుత్‌ సంస్కరణల పేరిట సబ్సిడీలు నిలిపివేయాలి, బడుగువర్గాలకు ఉచిత విద్యుత్‌ను రద్దు చేసి.. దొంగలకు సద్ది కట్టాలన్నదే బీజేపీ విధానంగా ఉందన్నారు.

CM KCR: మరో సంచలన అంశంలో PM Modiని టార్గెట్ చేసిన కేసీఆర్.. BJPపై నిప్పులుతెలంగాణలో కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు పోతారనే ఊహాగానాల నడుమ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అదే సమయంలో, టీఆర్ఎస్ ఈసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోనుందనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే నిర్వహిస్తోందని, తెలంగాణలో కూడా పీకే టీమ్ సర్వే చేస్తున్నారని, ఇప్పటికే టీఆర్ఎస్ కూడా విడిగా సర్వేలు చేయిస్తోందని, పీకే సర్వే ఎలా ఉంటుందో చూస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

CM KCR అనూహ్యం : సడన్‌గా Rahul Gandhiపై ప్రేమ ఎందుకు? గులాబీ బాస్ ఏం మెసేజ్ ఇస్తున్నారు?ధర్మం పేరిట బీజేపీ అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించిన కేసీఆర్.. బీజేపీ హఠావో.. దేశ్ బచావో అని నినాదమిచ్చారు. బీజేపీ అవినీతి చిట్టాను త్వరలోనే బయడపెడానన్న గులాబీ బాస్.. సంచలనాత్మక రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందంపైనా టీఆర్ఎస్ కేసు వేయబోతోంది చెప్పారు. ‘రఫేల్‌ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగింది. రూ. వేల కోట్లు కాజేశారు. ఇండోనేషియా మనకంటే చౌకగా కొన్నది. భాజపా పాలకుల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. దీనిపై దిల్లీలో పంచాయతీ పెడతా. నన్ను జైల్లో పెట్టుడు కాదు.. మిమ్మల్ని జైలుకు పంపేది పక్కా’ అని బీజేపికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Pm modi, Prashant kishor, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు