CM KCR: తెలంగాణలో కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..

సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

రాష్ట్రంలో కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నేడు ప్రగతి భవన్‌లో కరోనా కట్టడికి సంబంధించి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేసీఆర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

  • Share this:
    రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరోనా నియంత్రణపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వాక్సిన్, లాక్ డౌన్ అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్‌రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కరోనా కట్టడికి ద్విముఖ వ్యుహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు. జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీ సత్పలితాలు ఇస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కరోనా పరీక్షలను మరింతంగా పెంచాలన్నారు. పీహెచ్‌సీలో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్ల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి అన్ని వైద్య కేంద్రాల్లో కిట్ల సంఖ్య పెంచాలన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు కేసీఆర్ చెప్పారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు బెడ్స్, మందులు సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు.

    సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, వారి ఆరోగ్య రక్షణలో భాగంగా లాక్ డౌన్ కఠినంగానే అమలువుతున్నది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించడం కోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంది. సత్ఫలితాలనిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను నిర్వహిస్తూ వ్యాధి లక్షణాలున్నవారికి మందుల కిట్లను అందించే కార్యక్రమాన్ని కొనసాగించాలి. అదే సమయంలో కరోనా అనుమానితులకు పరీక్షలను నిరాకరించకూడదు. ఇంతవరకే పరీక్షలు నిర్వహిస్తామనే నిబంధనలు ఉండకూడదు. ప్రాథమిక వైద్య కేంద్రాల వద్దకు వచ్చే వారందరికీ పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల కోసం వచ్చే వారిలో అధికశాతం అత్యంత నిరుపేదలుంటారు కాబట్టీ ఏ ఒక్కరికి కూడా పరీక్ష నిరాకరించకూడదు. ఇట్లా మందుల కిట్లను అందిస్తూ పరీక్షల సంఖ్య పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలి’అని తెలిపారు.

    కరోనా పరీక్షలు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తక్షణమే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని సిఎం ఆదేశించారు. ఉత్పత్తిదారులతో మాట్లాడి, పీహెచ్ సీలకు, అన్ని పరీక్షా కేంద్రాలకు కిట్ల సరఫరాను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. అదే సమయంలో వైద్య కేంద్రాల్లో కావాల్సిన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు, వైద్యాధికారులకు ఇప్పటికే అధికారాలిచ్చిన నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సిఎం సృష్టం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని ఎంతటి ఖర్చుకైనా వెనకాడవద్దని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఖర్చు పెరిగే అవకాశాలున్న పోలీస్, వైద్యారోగ్య శాఖలకు బడ్జెట్ ను పెంచాలని, ఈ విషయం మీద సమీక్ష నిర్వహించాలని మంత్రి హరీష్ రావును సీఎం ఆదేశించారు. లాక్ డౌన్ తో కరోనాని సమర్థవంతంగా కట్టడి చేసిన ఢిల్లీలాంటి అర్బన్ కేంద్రాలలో చేపట్టిన చర్యలను అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. అవసరమైతే వైద్య బృందం వెల్లి పరిశీలించి రావాలన్నారు.

    అన్ని పడకలను ఆక్సీజన్ పడకలుగా మార్చాలని.. రాష్ట్రంలో ఆక్సీజన్ ఉత్పత్తిని 600 ఎం టీలకు పెంచే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. అదే సందర్భంలో...సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వాల్లు అధికి సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వారికి సరిపోను వాక్సిన్లను తక్షణమే సరఫరా చేయాల్సిందిగా సంబంధిత వాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాక్స్ ఫోర్సు చైర్మన్ మంత్రి కెటిఆర్ ను సీఎం ఆదేశించారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కునేందుకు సిద్దంగా వుండాలని తెలిపారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాని శాతం 5 శాతానికి తగ్గించగలిగినప్పుడే మనం కరోనా మీద విజయం సాధించినవారమౌతామని కేసీఆర్ అన్నారు.

    అదే సందర్భంలో కరోనానంతర పరిణామాల మీద సీఎం చర్చించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధిని కట్టడి చేయడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి సీఎం అధికారులతో చర్చించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకోసం గాంధీలో 150 బెడ్లను ఈ.ఎన్.టి. ఆస్పత్రిలో 250 బెడ్లను, మొత్తం కలిపి 400 బెడ్లను కేటాయించినట్లుగా వైద్యాధికారులు సీఎంకు వివరించారు. సరోజినీ దేవి ఆస్పత్రిలో 200 బెడ్లు, గాంధీ ఆస్పత్రిలో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకోసం తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందులను తక్షణమే ఆర్డరివ్వాలని సీఎం తెలిపారు. కరోనా కంట్రోల్ చేయడానికి మించిన ప్రాధాన్యత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని, ఎన్ని కోట్లయినా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా వుందని, అవసరమైతే అప్పు తెచ్చయినా కరోనా కట్టడికి సిద్దంగా వుంది అని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థ, యంత్రాంగంతో పాటు, ప్రైవేటు వైద్య రంగం, ఇతర రంగాలు కూడా మానవతా దృకృథంతో స్పందించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.
    Published by:Sumanth Kanukula
    First published: