Home /News /telangana /

CM KCR SAID THAT THERE SHOULD BE A DISCUSSION ON NATIONAL POLITICS IN THE VILLAGES AS WELL PRV

CM KCR: దేశ రాజకీయాలపై చర్చ జరగాలి.. టీవీల్లో వార్తలు చూసి వదిలేయవద్దు..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ముఖ్యమంతి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ‘‘దేశంలో జరిగే రాజకీయాలను (National Politics), దేశంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు గ్రామాల్లో, సిటీ అయితే గ్రామాల్లో చర్చలు జరిగాలి. టీవీల్లో వార్తలు చూసి వదిలేయవద్దు. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తుంది. చైతన్యం కోల్పోయి ఉంటే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది’ అని సీఎం కేసీఆర్​ (CM KCR) అన్నారు.  మేడ్చల్‌ (Medchal)–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఈ కార్యలయాలను ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో , ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్‌ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ మైదానంలో హెలిప్యాడ్‌ నిర్మాణం చేపట్టారు.

    ఎన్ని బాధలు పడ్డాం..

    కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. ‘ఏ సమాజమైతే, ఏ ప్రజలైతే ఆలోచన లేకుండా, నిద్రాణమై, నిర్లక్ష్యంగా ఉంటరో వారు దెబ్బతినే అవకాశం ఉంటుంది. 60 సంవత్సరాల కిందట తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండే. ఆ సమయంలో మనకు ఇష్టం లేకపోయినా.. పోరాడలేదు కాబట్టి తెలంగాణను తీసుకుపోయి.. ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఎన్ని బాధలు పడ్డాం. ఎంత మంది పిల్లలు చనిపోయారు? ఎంత మంది జైళ్లపాలయ్యారు? 58 సంవత్సరాలు మడమతిప్పని పోరాటం చేస్తే మళ్లా మన రాష్ట్రం మనకు వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే.. కరెంటు మనకు వచ్చేదా? ఈ సంక్షేమం వచ్చేదా? ఇన్ని పింఛన్లు వచ్చేవా? ఈ విధంగా మంచినీళ్లు వచ్చేవా? చాలాచాలా అవస్థల్లో ఉండేవాళ్లం. దేశంలో జరిగే రాజకీయాలను, దేశంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు గ్రామాల్లో, సిటీ అయితే గ్రామాల్లో చర్చలు జరిగాలి. టీవీల్లో వార్తలు చూసి వదిలేయవద్దు. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తుంది.” అని కేసీఆర్​ అన్నారు.

    Munugodu by Elections: తెలంగాణ రాజకీయం.. మునుగోడులో పోటీకి ఆ జాతీయ పార్టీ భయపడుతోందా? 

    రాష్ట్రంలో అన్ని రంగాలకూ 24 గంటలూ కరెంట్‌ అందిస్తున్నాం. హైదరాబాద్‌లో కరెంట్‌ పోదు కానీ.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్‌ ఉండదు. దేశంలో 75 ఏళ్ల నుంచి జరుగుతున్న అసమర్థ పరిపాలన, చేతకాని, తెలివి తక్కువతనం పరిపాలన వల్లే ఈ ఇబ్బందులు. దేశంలో నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. తెలంగాణపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఏపీలోనూ..

    ఇప్పుడు ఇండియాలో నెంబర్‌వన్‌..

    ఒకప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం కేవలం రూ.లక్షగా ఉండేదని... ఇప్పుడు ఇండియాలో నెంబర్‌వన్‌గా రూ.2,78,500కు పెరిగిందని అన్నారు. ఈ విషయంలో మనకన్నా ముందుండే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లను దాటి ఈ ఘనత సాధించామని అన్నారు. తెలంగాణ ఇంత అభివృద్ధి చెందడం చూసి దేశమంతా ఆశ్చర్యపోతుందని కేసీఆర్ అన్నారు. చేనేత, గీత కార్మికులకు, బోదకాలు బాధితులకు ఇలా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, National, Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు