హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: పాతబస్తీలో ఉద్రిక్తతలపై సీఎం కేసీఆర్ సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు..

CM KCR: పాతబస్తీలో ఉద్రిక్తతలపై సీఎం కేసీఆర్ సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR: హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని.. విచ్ఛిన్న శక్తులను అణచివేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు బలగాలను మోహరించాలని అధికారులను ఆదేశించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో దుమారం రేగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ (Hyderabad) ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  రాజాసింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాతబస్తీలో  కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి తర్వాత కూడా నిరసనకారులు రోడ్డెక్కడం.. కొన్ని చోట్ల పోలీసులపై రాళ్ల దాడులు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తులున్నాయి. ఈ క్రమంలోనే పాతబస్తీలో (Hyderabad old city protests) పోలీసులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకే పెట్రోల్ బంకులు మూసివేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించారు.  గత మూడు రోజులుగా హైదరాబాద్ పాతబస్తీలో నెలకొన్న పరిస్థితులతో పాటు ఇతర ప్రాంతాల్లో చోటు చేసుకున్న రాజకీయ సంఘటనలు సీఎం దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్ (CM KCR) సమీక్ష నిర్వహించారు. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని.. విచ్ఛిన్న శక్తులను అణచివేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు బలగాలను మోహరించాలని అధికారులకు సూచించారు. మత సామరస్యానికి, శాంతిభద్రతలకు తెలంగాణ మారుపేరని, వాటికి ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించరాదని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.  రాష్ట్రంలో తాజా పరిణామాల వెనుక రాజకీయ కోణం ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కొందరు వ్యక్తులు పక్కా ప్లాన్‌తోనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. వాటిని కట్టడి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలపై పటిష్ట నిఘా ఉంచాలని.. ప్రతిచిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు.
  ఇందుకోసం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ సేవలను వాడుకోవాలని చెప్పారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా వాహనదారులపై జరిగిన దాడి సీఎం దృష్టికి వచ్చింది. దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్ , రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు సీవీ.ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Hyderabad, Raja Singh, Telangana

  ఉత్తమ కథలు