తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ భవిష్యత్, సమ్మె ప్రభావం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. సమ్మె విరమించాలని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా ఎవరూ సమ్మెను విరమించలేదు. చాలా తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని..ఇటు ఆర్టీసీలో.. అటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
కేసీఆర్‌తో సమీక్షా సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ హాజరయ్యారు. ఆర్టీసీలో అద్దె బస్సులను 50శాతం పెంచడం, అర్హులైన యువతీ యువకులను డ్రైవర్లు, కండక్టర్లుగా నియమించి వారిని శిక్షణ అందించడం వంటి ప్రతిపాదనపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇందిరాపార్క్ వద్ద ఆమరణ దీక్ష చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆర్టీసీ దీక్షకు కాంగ్రెస్, తెలంగాణ జన సమితితో పాటు పలు ట్రేడ్ యూనియన్లు మద్దతిచ్చాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.