Home /News /telangana /

CM KCR REVIEW MEETING ON NEW GRAMPANCHAYATHI LAW MK

పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం...సీఎం కేసీఆర్‌

కేసీఆర్ (File)

కేసీఆర్ (File)

జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు ఇప్పటి మాదిరిగా ఏ పనీ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

    కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో పంచాయతీరాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు ఇప్పటి మాదిరిగా ఏ పనీ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించారు.

    అలాగే పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సిఇవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇవోపిఆర్డీ పోస్టులను ఇకపై మండల పరిషత్ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సిఇవోలు, డిపిఓలు, సిఇవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలని చెప్పారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: CM KCR, Gram Panchayat Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు