• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • CM KCR RELEASES WATER TO NIZAM SAGAR THROUGH HALDI VAGU FROM KONDAPOCHAMMA SAGAR PROJECT AK

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు.. వాటికి నీటి విడుదల

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు.. వాటికి నీటి విడుదల

కాళేశ్వరం జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్

Telangana: కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ కు తరలించే కార్యక్రమం చేపట్టారు సీఎం కేసీఆర్.

 • Share this:
  తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ లక్ష్యమని పదే పదే చెప్పే సీఎం కేసీఆర్.. ఈ క్రమంలో మరో ముందడుగు వేశారు. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్‌కు చేరుకున్నాయి. నేడు ఆ జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ కు తరలించే కార్యక్రమం చేపట్టారు సీఎం కెసిఆర్. అనంతరం కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు. దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

  అంతకుముందు ఉదయం ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలాలను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌కు చేరుకుంటాయి. ఈ కార్యక్రమం అనంతరం మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరం జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞా పుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి. ఈ కార్యక్రమంలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హ‌రీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: