హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR Press Meet: ద‌మ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలి.. కిష‌న్ రెడ్డికి కేసీఆర్ స‌వాల్‌

CM KCR Press Meet: ద‌మ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలి.. కిష‌న్ రెడ్డికి కేసీఆర్ స‌వాల్‌

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

CM KCR: కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డికి కేసీఆర్ (KCR) స‌వాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎలాం టి ప్రయోజనం లేదు. కిషన్‌రెడ్డి దమ్ముంటే కేంద్రంతో ధాన్యాన్ని కొనిపించాల‌ని స‌వాల్ విసిరారు.

కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డికి కేసీఆర్ (KCR) స‌వాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎలాం టి ప్రయోజనం లేదు. కిషన్‌రెడ్డి దమ్ముంటే కేంద్రంతో ధాన్యాన్ని కొనిపించాల‌ని స‌వాల్ విసిరారు. సుదీర్ఘ కేబినెట్ భేటీ అనంత‌రం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు.ఈ సంద‌ర్భంగా కేంద్రం తీరుపై విమ‌ర్శలు చేశారు. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ( Kishan reddy)పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి ప‌నుల‌ను బీజేపీ జీర్ణించుకోలేక‌పోతుంద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక బాధ్య తను విస్మరించి ధాన్యా న్ని కొనలేమని చెబుతోంద‌ని కేసీఆర్ అన్నారు. కేంద్ర‌తీరుతో రైతులు గంద‌ర‌గోళం చెందుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏదైన న‌ష్టం వ‌స్తే కేంద్రం భరిం చాలే తప్ప రాష్ట్రాలపై నెట్టకూడదు.

ఇలాం టి నీచమైన కేంద్ర ప్రభుత్వా న్ని తాను ఇం తవరకూ చూడలేదు అన్నారు.. ఇకపై చూస్తానని కూడా అనుకోవడం లేదు. పచ్చి అబద్ధాలు ఆడుతూ కేంద్రం దిగజారి ప్రవర్తిస్తుంది అంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

Omicron: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఏమిటి?.. ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి


యాసంగిలో కోనుగోలు కేంద్రాలు ఉండ‌వు..

కేంద్రం ప్ర‌భుత్వం వ‌రి కొన‌క‌పోవ‌డం కార‌ణంగా యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండ‌వ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. రైతులు ఇష్టం ఉంటే పంట వేసుకోవ‌చ్చ‌ని అన్నారు. రైతులు నష్టపోవద్దని మేం ధైర్యం గా చెబుతున్నామ‌ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రతి ఒక్క టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అందిస్తాం అన్నారు.

కిష‌న్‌రెడ్డి ఏమ‌న్నారు...

ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో నేడు టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మాణం ఇవ్వడంతోపాటు సభలో ఆ పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. ( Kishan reddy on kcr ) ధాన్యం కొనుగోలు విషయంలో లేని విషయంపై టీఆర్ఎస్ నేతలు రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు..

CAT 2021 : "క్యాట్‌" క్వాలిఫై అవ్వ‌లేక‌పోతున్నారా..? అయితే ఐఐఎంలో సీట్ పొందేందుకు ఇత‌ర మార్గాలు ఇవే!


రాష్ట్ర ప్రభుత్వమే బాయిల్డ్ రైస్ ఇవ్వమని ఉత్తరం రాసిందని, ఇప్పుడు అదే విషయాన్ని లేవనెత్తి వివాదం చేస్తున్నారని అన్నారు. ఇందుకు కారణం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడమేనని అన్నారు. అంతే కాని.. ధాన్యం కొనుగోలుపై ఎలాంటీ సమస్య లేదని చెప్పారు. ప్రస్తుతం సీజన్‌లో ఎంత ధాన్యమైన కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని ఆయన చెప్పారు.


రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించకుండా రాజకీయాలు చేయడంతోపాటు సరైన పంటల విధానం కూడా లేదని ఆయన విమర్శించారు. ( Kishan reddy on kcr ) అనవసరంగా ఆందోళన చేసి రైతులను ఆయోమయానికి గురి చేసి వారి జీవితాలతో చెలగాటం అడవద్దని ఆయన హితవు పలికారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఆందోళనలు రాజకీయ ఎత్తుగడలో భాగమని అభివర్ణించారు.

First published:

Tags: Central Government, CM KCR, Kishan Reddy, Telangana

ఉత్తమ కథలు