స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) శుభవార్త చెప్పారు. 57 ఏళ్ల వయసు దాటిన అర్హులందరికీ ఆగస్టు 15 నుంచి పెన్షన్ (Aasara Pensions) ఇస్తామని చెప్పారు. కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లను ఇవ్వబోతున్నామని తెలిపారు. అలాగే డయాలిసిస్ పేషెంట్ల (Dialysis)కు కూడా ప్రతి నెలా 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పారు. అనాథ పిల్లలను రాష్ట్ర పిల్లలుగా గుర్తించి.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
'' 57 ఏళ్ల వయసున్న దాటిన వారికి పె న్షన్ ఇస్తామన్నాం. కరోనా, ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు లిస్ట్ తయారు చేశాం. 10 లక్షల కొత్త మందికి పెన్షన్లు ఇవ్వబోతున్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలు పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్ ఉన్నాయి. కొత్తగా 10 లక్షల మంది వచ్చారు. మొత్తం 46 లక్షల మందికి పెన్షన్ అందుతుంది. బోదకాలు రోగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు కూడా పెన్షన్ ఇస్తున్నాం. 12 వేల మంది డయాలిసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్ ఇస్తాం. సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేస్తాం. అనాథ పిల్లలను స్టేట్ చిల్ట్రన్‌గా డిక్లేర్ చేస్తున్నాం. అనాథలకు కేజీ నుంచి పీజీ వరకు విద్య అందిస్తాం. ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తాం. విధి వంచితులకు ప్రభుత్వం ఆదుకుంటుంది. ' ' అని సీఎం కేసీఆర్ చెప్పారు.
గాలికి తప్ప అన్నింటికీ పన్ను ఉందని కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. దౌర్భాగ్యకరంగా ఉన్న పన్నుల విధానాన్ని మార్చాలని అన్నారు. పాలు, శ్మశానాలు, బీడీలపై విధించిన పన్నును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. FRMB పేరిట విధించిన కోతలను విరమించుకోవాలన్నారు సీఎం కేసీఆర్. దయచేసి రాష్ట్రాల అభిృద్ధికి దోహదపడాలని విజ్ఞప్తి చేశారు. బలమైన రాష్ట్రాలుంటేనే.. బలమైన భారత దేశముంటుందని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం.
ప్రధాని మోదీపై ఎలాంటి వ్యక్తిగతమైన కోపం లేదని.. ఆయన తనకు మంచి మిత్రుడని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజా సమస్యలు, దేశం కోసం మాత్రం ఎవరితోనే సంఘర్షిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నామని.. అయినా వినకుంటే.. బలీయమైన ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కలిసి వచ్చే వారితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలను చేస్తామని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara Pension Scheme, CM KCR, Telangana