• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CM KCR PREPARING STRATEGIES TO CHECKMATE BJP IN GHMC ELECTIONS TALKS WITH MIM CHIEF ASADUDDIN OWAISI AK

Telangana: దుబ్బాక ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన కేసీఆర్.. ఏం జరుగుతోంది ?

Telangana: దుబ్బాక ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన కేసీఆర్.. ఏం జరుగుతోంది ?

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

Telangana: గ్రేటర్‌లో మళ్లీ బీజేపీని నిలువరించడం ఎలా అనే అంశంపై కేసీఆర్, అసదుద్దీన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారని సమాచారం.

  • Share this:
    దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌పై బీజేపీ గెలుపు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే దానిపై రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. దుబ్బాక తరువాత బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికలపై గట్టిగా ఫోకస్ చేస్తుందని.. గ్రేటర్‌లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుందని వేరే చెప్పనవరం లేదు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు కూడా స్పష్టంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ తిరిగి పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు ఎక్కువగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూస్తుండగా... గ్రేటర్ ఎన్నికల విషయంలో మాత్రం మళ్లీ పూర్తిస్థాయిలో కేసీఆర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నేడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్... దుబ్బాకలో బీజేపీ గెలుపుతో ఎవరూ హైరానా చెందవద్దని వారికి సూచించారు.

    బీజేపీ అబద్ధాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. అయితే టీఆర్ఎస్ నేతలతో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో ప్రత్యేకంగా సమావేశం కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సాధ్యమైనంత తొందరగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ అధికార పార్టీ... ఈ విషయంలో తమ ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దనే వ్యూహంతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. తమ మిత్రపక్షమైన ఎంఐఎంతోనూ ఈ అంశంపై అభిప్రాయం తీసుకునేందుకు అసదుద్దీన్‌తో చర్చలు జరిపారని తెలుస్తోంది.

    గ్రేటర్‌లో మళ్లీ బీజేపీని నిలువరించడం ఎలా అనే అంశంపై కేసీఆర్, అసదుద్దీన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారని సమాచారం. ఎంఐఎం కూడా ఓకే అంటే టీఆర్ఎస్ సాధ్యమైనంత తొందరగా గ్రేటర్ ఎన్నికలకు వెళ్లడం ఖాయమనే పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే వార్తల నేపథ్యంలో.. బీజేపీకి చెక్ చెప్పేందుకు టీఆర్ఎస్, ఎంఐఎం సాయం తీసుకోనుందా అనే చర్చ కూడా మొదలైంది.

    జీహెచ్ఎంసీలోని 150 సీట్లలో ప్రస్తుతం టీఆర్ఎస్‌కు 99 సీట్లు ఉండగా.. ఎంఐఎంకు 44 సీట్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో సొంతంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సొంతం చేసుకున్న టీఆర్ఎస్.. మరోసారి అదే రకమైన ఫలితాలను ఆశిస్తోంది. అయితే ఈసారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉండటంతో... గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను సీఎం కేసీఆర్ స్వయంగా రచిస్తున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: