Home /News /telangana /

CM KCR PICKS FORMER COLLECTOR VENKATRAMREDDY PADI KOUSHIK REDDY AS MLCS TRS MLC CANDIDATES FULL LIST HERE MKS

cm kcr : జాక్‌పాట్ కొట్టిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి -దళిత నేత ఎర్రోళ్లకు మొండిచేయి - trs mlc లిస్టు ఇదే

వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఆశీర్వాదం(పాత ఫొటో)

వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఆశీర్వాదం(పాత ఫొటో)

తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది అధికార టీఆర్ఎస్ పార్టీ. గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనలైజ్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా కొద్ది సేపటి కిందటే విడుదలైంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి జాక్ పాట్ తగలగా, ఉద్యమకారుడైన దళిత నేతకు షాక్ తగిలింది..

ఇంకా చదవండి ...
తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది అధికార టీఆర్ఎస్ పార్టీ. గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఫైనలైజ్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా కొద్ది సేపటి కిందటే విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యా బలాన్ని బట్టి ఈ ఆరుగురూ ఎమ్మెల్సీలు దాదాపు ఏకగ్రీవంగానే ఎన్నిక కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు(mlc elections) లో నామినేషన్ దాఖలుకు నేడే ఆఖరిరోజు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మధుసూదనా చారి, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, ఆకుల లలితతోపాటు వెంకట్రామిరెడ్డి పేరు కూడా ఉంది. జాబితా ప్రకటించే ముందు వరకూ ప్రాబబుల్స్ లో ఉన్న టీఆర్ఎస్ దళిత నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు చివరికి నిరాశ ఎదురైంది. సోమవారం నాడే సిద్దిపేట్ కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డికి జాక్ పాట్ మాదిరిగా మంగళవారం నాడు ఎమ్మెల్సీ పదవి దక్కింది.

Etela Rajender ఆ పని చేయగలరా? -cm kcrకు షాకిచ్చేలా bjp సరికొత్త వ్యూహం ఇదే..


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లకు చివరి రోజు ఇవాళే కావడం, మంగళవారం మధ్యాహ్నం 3 గంటకు గడువు ముగియనుండటంతో  టీఆర్ఎస్  అభ్యర్థులుగా ఖరారైన ఆరుగురు నేతలు.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుని నామినేషన్లు వేసేందుకుగానూ అసెంబ్లీకి బయలుదేరారు.  నిజానికి..

etela rajender గేమ్ స్టార్ట్ -cm kcrపై అనూహ్య దాడి -bjpలో ఉన్నా మారని నైజం


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపిక కోసం సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తు చేసినట్లుగా లిస్టులోని పేర్లను బట్టి అర్థమవుతోంది. మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసి మండలి చైర్మన్ బాధ్యతలు కూడా ఇస్తారని ప్రచారం జరిగినా, ఆయనకు  ఎమ్మెల్యే కోటాలోనే పదవి దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆకుల లలితకు ఎమ్మెల్యే కోటాలో ఖరారు కావడంతో సీఎం కేసీఆర్ కూతురు కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో పోటీ చేయడం అనివార్యమైంది.

kalvakuntla kavitha : సీఎం కేసీఆర్ కూతురికి మళ్లీ పదవి.. ఈసారి ఏ కోటాలో?


హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినా, ముందుగా ఇచ్చిన మాట ప్రకారం పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ స్థానం ఖారైంది. గవర్నర్ తిరస్కరణకు గురైన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపుతున్నారు. సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా జాక్ పాట్ కొట్టేశారు. అయితే చివరి నిమిషం దాకా బరిలో ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్ కు చివరికి నిరాశే మిగిలింది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Mlc elections, Trs

తదుపరి వార్తలు