CM KCR PARTICIPATES IN MAHADHARANA AT INDIRAPARK IN HYDERBAD VRY
cm kcr mahadharna : మహాధర్నాలో సీఎం కేసిఆర్.. భారీ ఏర్పాట్లలో మంత్రులు
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
cm kcr mahadharna : రైతులకు మద్దతుగా సీఎం కేసిఆర్ పాల్గొననున్న మహాధార్నకు ఏర్పాట్లు పూర్తయ్యాయి..ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు..
తెలంగాణ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసిఆర్.. నేరుగా ధర్నాలో పాల్గొననున్నారు. దీంతో రేపు జరగనున్న ధర్నా కార్యక్రమం ఉత్కంఠగా మారింది.ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరికి నిరసనగా ఇప్పటకే రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఇందుకు అనుగుణంగా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు గురువారంనాడు ఇందిరాపార్కు వద్ద మహాధర్న చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసిఆర్‌తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారు.
కాగ ధర్న చౌక్ వద్ద ఏర్పాట్లను మంత్రులు హరీష్ రావుతోపాటు శ్రీనివాసయాదవ్‌లు కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సంధర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..రైతుల కోసమే తాము ధర్నా చేపడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా తలపెట్టినట్టు చెప్పారు. తాము అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షం అని స్పష్టం చేశారు..
మరోవైపు దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఒకే విధానం ఉండాలని. పంజాబ్‌లో పండిన ప్రతి గింజా కొంటున్న కేంద్రం , తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రానికో విధానం ఉంటుందా అని ప్రశ్నించారు.. ఒక రాష్ట్రంలో కొనుగోలు చేసి మరో రాష్ట్రంలో చేయకపోవడం అంటే.. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని అన్నారు.. ఇక వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు..
ఈ మహాధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, డీసీఎంఎస్ ఛైర్మన్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, తెరాస శ్రేణులు పాల్గొని రైతుల పక్షాన నిరసన తెలుపుతామని చెప్పారు... అత్యంత శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మహాధర్నా నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు.
మరోవైపు రాష్ట్ర విభజన సంధర్భంలో ఏడు మండలాలను ఏపీలో కలిపారని, దీంతో రాష్ట్రానికి ఏడాదికి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లుతోందని అన్నారు... విలీనంపై బంద్‌కు పిలుపునిచ్చి అప్పట్లోనే తీవ్ర నిరసన వ్యక్తంచేశామని అన్నారు... రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కేంద్రం తీరుపట్ల నిరసన తెలిపామని అన్నారు... ఈరోజు కూడా లక్షలాది మంది రైతుల పక్షాన నిలబడి కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ మహాధర్నా తలపెట్టామని చెప్పారు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.