Home /News /telangana /

CM KCR ORDERS TO PREPARE 33 FOOD ITEMS FOR TRS PLENARY HERE IS MENU AND KEY POLITICAL RESOLUTIONS LIKELY MKS

CM KCR: అట్లుంటది కేసీఆర్‌తోని.. టీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల పసందైన వంట‌కాలు..

టీఆర్ఎస్ ప్లీనరీలో వంటకాలు(గతేడాది ఫొటో)

టీఆర్ఎస్ ప్లీనరీలో వంటకాలు(గతేడాది ఫొటో)

ప్రజలతో మమేకం అయ్యే ప్రతి సందర్భంలోనూ, అవి భారీ బహిరంగ సభలైనా కచ్చితంగా భోజనం ఏర్పాట్లు చేయిస్తారు సీఎం కేసీఆర్. మరి పరిమిత సంఖ్యలో శ్రేణులు హాజరయ్యే టీఆర్ఎస్ పుట్టిన రోజు పండుగను మాత్రం తేలికగా తీసుకోరుకదా!

బేసిగ్గా భోజనప్రియుడైన కేసీఆర్ చూడటానికి బక్కపలుచన.. కానీ పెట్టడానికి మాత్రం పెద్దచేయి. ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌజ్ కు వచ్చే అతిథులు, సన్నిహితులతో విందు భోజనాలు ఆయనకు నిత్యకృత్యం. ప్రజలతో మమేకం అయ్యే ప్రతి సందర్భంలోనూ, అవి భారీ బహిరంగ సభలైనా కచ్చితంగా భోజనం ఏర్పాట్లు చేయిస్తారాయన. అలాంటిది పరిమిత సంఖ్యలో శ్రేణులు హాజరయ్యే పార్టీ పుట్టిన రోజు పండుగను మాత్రం తేలికగా తీసుకోరుకదా! ఊహించినట్లుగానే ఈసారి పార్టీ ప్లీనరీలోనూ ఊరించే వంటకాలను వండిస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్లీనరీకి హాజరయ్యే అతిథుల కోసం సీఎం ఏకంగా 33 రకాల పసందైన వంటకాలను ప్రిపేర్ చేయిస్తున్నారు..

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్‌ మహా నగరం ముస్తాబైంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 3వేల మంది ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు.

హుస్సేన్ సాగర్ లో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రచార బోటు

Telangana: ఏపీ పుష్పలా మరో భర్తకు షాకింగ్ సర్‌ప్రైజ్.. ఇష్టంలేని పెళ్లి చేశారని అతని గొంతు కోసింది..


ప్లీన‌రీకి హాజ‌ర‌య్యే టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నోరూరించే వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. ప్లీన‌రీలోని వంట‌ల ప్రాంగ‌ణం రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో ఘుమ‌ఘుమ‌లాడుతోంది. క‌డుపు నిండా భోజ‌నం వ‌డ్డించేందుకు వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 33 ర‌కాల వెరైటీల‌ను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా సూచనలిస్తూ మెనూను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు.. మళ్లీ ఆ ఆప్షన్ అందుబాటులోకి..


టీఆర్ఎస్ ప్లీనరీలో వడ్డించబోయే 33 ర‌కాలవెరైటీల్లో మెజార్టీ వాటా మాంసాహారానిదే అయినా శాఖాహారానికీ లోటు లేకుండా చూసుకున్నారు. స్వీట్లు, ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయా లిస్టులో. ప్లీనరీ మెనూలోని ఐటమ్స్ ఏవంటే..: డబుల్‌కామీట, గులాబ్‌జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్‌ బిర్యానీ, ధమ్‌కా చికెన్‌, మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా, వైట్‌ రైస్‌, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ, వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్‌, టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్స్‌ స్టాల్‌, అంబలి, బటర్‌ మిల్క్‌. ప్లీనరీలో భోజనం  తిన్నవాళ్లంతా ‘అట్లుంటది కేసీఆర్‌సార్‌తోని’అనుకోవాలెమల్ల.

Astro Vastu Tips: ఈ ఒక్కటీ మీ ఇంట్లో ఉంటే.. డబ్బు కష్టాలు దూరం.. వాస్తు దోష నివారణ కూడా..


హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రతినిధుల సభతో ప్రారంభం కానుంది. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ప్లీనరీని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్లీనరీకి 3000 మంది ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది. హాజరయ్యే ప్రతినిధులకు బార్ కోడ్‌తో కూడిన ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ప్రతినిధులకు లోనికి అనుమతిస్తారు. ఈ ప్లీనరీలో 11 అభివృద్ధి, రాజకీయ అంశాలపై తీర్మానాలు జరగనున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండగ నిర్వహించనుంది.

CM KCR | Prashant Kishor: షాకింగ్ ట్విస్ట్: కేసీఆర్‌కు పీకే కటీఫ్.. ఇక టీఆర్ఎస్ ఓటమే ధ్యేయం!


వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం.. మోదీ-బీజేపీపై కేసీఆర్ యుద్ద ప్రకటన.. పార్టీ బలాబలాపై విస్తృతస్థాయి సర్వేలు.. ప్రశాంత్ కిషోర్ రంగ ప్రవేశం.. కేంద్రంతో యుద్దం.. అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శల హోరు.. తదితర అంశాల నేపథ్యంలో ఈ ఏడాది టీఆర్ఎస్ ప్లీనరీకి అధికా ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్ఎస్ చేయబోయే తీర్మానాల్లో కీలకమైన కొత్త అంశాలు ఉండబోతున్నట్లు సమాచారం. శ్రేణులు దిశానిర్దేశం, ప్రత్యర్థులకు హెచ్చరికలతో టీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Hyderabad, Kcr, KTR, Telangana, Trs

తదుపరి వార్తలు