CM KCR ORDERS NOT TO ALLOCATE NIGHT DUTIES TO RTC WOMEN EMPLOYEES BS
షాద్నగర్ ఘటన ఎఫెక్ట్.. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వద్దన్న కేసీఆర్..
సీఎం కేసీఆర్
TSRTC : షాద్నగర్ ఘటన రాత్రి సమయంలో జరిగినందున ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయొద్దని యాజమాన్యాన్ని ఆదేశించారు. రాత్రి 7.30 నుంచి 8.30 లోగా మహిళా ఉద్యోగుల డ్యూటీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
షాద్నగర్ నిర్భయ ఘటనపై స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ ఘటనను అత్యంత దారుణ, అమానుషమైనదిగా చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన సీఎం.. ఈ సందర్భంగా ఘటనను గుర్తు చేసుకుంటూ మహిళా ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. షాద్నగర్ ఘటన రాత్రి సమయంలో జరిగినందున ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయొద్దని యాజమాన్యాన్ని ఆదేశించారు. రాత్రి 7.30 నుంచి 8.30 లోగా మహిళా ఉద్యోగుల డ్యూటీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ‘అది అత్యంత దారుణమైన, అమానుషమైన దుర్ఘటన. రాత్రి సమయంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దు. మాన మృగాలు మనమధ్యే తిరుగుతున్నాయి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇదిలా ఉండగా, షాద్నగర్ హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.