దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తెలంగాణలోనూ రోజురోజూకీ విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. బయట తిరిగే సాధారణ జనమే కాదు.. జైళ్లలోని ఖైదీలను సైతం కరోనా వదలడం లేదు. అందులో భాగంగానే చాలామంది ఖైదీల ఆరోగ్య పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని హోంశాఖను సీఎం కోరారు. ఈ విషయమై సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్వి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలోని సత్ప్రవర్తన కలిగి అర్హత ఉన్న ఖైదీలందరి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వారందరినీ ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ జైళ్ల శాఖ దాదాపు వంద మందకి పైగా పెరోల్‌పై విడుదల చేశారు. అయితే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఖైదీల మొహాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.