Home /News /telangana /

CM KCR ONCE AGAIN FOCUS ON NEW REVENUE LAW IN TELANGANA AK

సీఎం కేసీఆర్ నోట.. మరోసారి ఆ కొత్త చట్టం మాట..

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నామన్న సీఎం కేసీఆర్.. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతామని తెలిపారు.

ఇంకా చదవండి ...
    రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తామని సీఎం కేసీఆర్ అనేకసార్లు వెల్లడించారు. ఈ విషయంలో ఉద్యోగులు, విపక్షాల నుంచి అభ్యంతరాలు వచ్చినా... కేసీఆర్ పట్టించుకోలేదు. దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం ఉంటుందని ఆయన గతంలో వివరించారు. అన్నీ అనుకున్నట్టు జరిగి... కరోనా సంక్షోభం లేకపోయి ఉంటే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చేవారేమో. కానీ కరోనా సంక్షోభం కారణంగా చాలా విషయాలు పెండింగ్‌లో పడిపోయినట్టే... కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన కూడా పక్కకపోయిందని అంతా అనుకున్నారు.

    కరోనా నుంచి రాష్ట్రం, దేశం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని కాబట్టి.. సీఎం కేసీఆర్ ఇప్పుప్పుడే మళ్లీ కొత్త రెవెన్యూ చట్టం ప్రస్తావన తీసుకురాకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే తాను అనుకున్నది చేసే విషయంలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగే సీఎం కేసీఆర్... కొత్త రెవెన్యూ చట్టం విషయంలోనూ ముందుకు సాగాలనే ఆలోచనతో ఉన్నట్టు అర్థమవుతోంది. విద్యాశాఖకు సంబంధించిన నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నామన్న సీఎం కేసీఆర్.. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతామని తెలిపారు. దీంతో ఏ మాత్రం పరిస్థితులు మెరుగుపడినా... తాను కీలకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్ అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana, Telangana revenue officers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు