కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన సీఎం కేసీఆర్

ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కొత్త ఇంటిని నిర్మించిన సీఎం కేసీఆర్... నేడు గృహప్రవేశం చేశారు.

news18-telugu
Updated: December 12, 2019, 3:05 PM IST
కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కొత్త ఇంటిని నిర్మిస్తున్న సీఎం కేసీఆర్... మంచి రోజులు ముగుస్తున్నాయనే కారణంగా ఈ రోజు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న ఇంటి పక్కనే ఈ కొత్త ఇంటి నిర్మాణం జరిగినట్టు సమాచారం. కొత్త ఇంట్లో గృహప్రవేశం తరువాత మరోసారి వ్యవసాయ క్షేత్రంలో యాగం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపించాయి.
Published by: Kishore Akkaladevi
First published: December 12, 2019, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading