CM KCR NEW CONSPIRACY TO WIN GHMC ELECTIONS ALLEGES VIJAYASHANTI AK
GHMC Elections: అలాంటి ఆలోచనలో కేసీఆర్.. విజయశాంతి అనుమానాలు
సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)
CM KCR Vijayashanti: ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని విజయశాంతి మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎంఐఎంతో కలసి కుట్రలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కేసీఆర్ వాటిని కట్టడి చేయలేకపోయారని విమర్శించారు. అలా కట్టడి చెయ్యకపోగా ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని మండిపడ్డారు.
ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్కు అలవాటుగా మారిపోయిందని విజయశాంతి విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని అన్నారు.
కొంతకాలంగా కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే కారణం ఏంటో తెలియదు కానీ.. బీజేపీలో ఆమె చేరిక ఆలస్యమవుతూ వస్తోంది. అయితే గ్రేటర్ ఎన్నికలు పూర్తయిన తరువాత విజయశాంతి బీజేపీలో చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.