హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS Politics : లాలుకు పట్టిన గతే కేసీఆర్‌కు ..! జైలు అనుభవం కోసమే తేజస్వీయాదవ్ తో భేటి..

TS Politics : లాలుకు పట్టిన గతే కేసీఆర్‌కు ..! జైలు అనుభవం కోసమే తేజస్వీయాదవ్ తో భేటి..

Bandi-Sanjay-Kumar

Bandi-Sanjay-Kumar

Bandi sanjay : ఓ వైపు తెలంగాణ సీఎం కేంద్రంపై నిప్పులు చెరుగుతుంటే మరోవైపు బీజేపీ సైతం అదేస్థాయిలో విరుచుకుపడుతున్నారు.. ఈ క్రమంలోనే సీఎం కేసిఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి హెచ్చరించారు.

ఇంకా చదవండి ...

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర పోరు కొనసాగుతుంది.. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుక పావులు కదుపుతున్నారు. బీజేపికి ప్రత్యామ్నాయంగా సీఎం కేసిఆర్ పార్టీల కూటమిని ఏర్పాటు చేసేందుకు మంతనాలు జరుపుతుంటే... మరోవైపు బీజేపీ సైతం అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ సీనియర్ నేతలను రంగంలోకి దింపింది. దీంతో సీఎం కేసిఆర్‌పై వరుసగా ఆవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లే కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. దీంతో కేసీఆర్ పై పై చేయి సాధించి ఫ్రంట్ ఏర్పాటును నిర్వీర్యం చేయాలనే వ్యుహంతో బీజేపీ ముందుకు పోతుంది.

ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎంను టార్గెట్ చేస్తూ తీవ్రంగా హెచ్చరించారు. ఆయన్ను జైలుకు పంపడం ఖాయమని ఉద్ఘటించారు. సీఎం కేసీఆర్ పై కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని అన్నారు. ఈక్రమంలోనే సీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైందని, ఎప్పుడైనా కేసీఆర్‌ జైలుకి వెళ్ళొచ్చన్నారు. అంతేకాకుండా ఈ విషయం కేసీఆర్‌ కు తెల్సి పోయిందని, అందుకే కమ్యూనిస్టుల తోను, ఇతర పార్టీల నేతల తో భేటీ అవుతున్నాడని విమర్శించారు.

TRS MLA: ఆ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా? లేక రాజీ పడుతారా? కొడుకు పాపాలే తండ్రికి ఎసరు.!


ఇక తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పశుగ్రాసం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని, కేసీఆర్‌ కూడా జైలుకు వెళ్తే ఎలా వుంటుందో.. తేజశ్వి యాదవ్ నిన్న ప్రగతి భవన్ కు వచ్చి వివరించి ఉంటాడని ఎద్దేవా చేశారు.

Rain : బీభత్సం సృష్టించిన వర్షం. సుమారు గంటపాటు ఎడతెరపి లేకుండా .. హోర్డింగ్‌ నేలమట్టం.


కేంద్రం జైలుకు పంపుతుందనే కమ్యూనిస్టులు, విపక్ష నేతలు కేసీఆర్‌ను పరామర్శించేందుకు వస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపుతే సానుభూతి కోసం కూడా కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నడని ఆరోపించారు. ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. దోచు కోవడం దాచుకోవడమే. కేసీఆర్ పని. కేసీఆర్‌ను ఎక్కడున్న గుంజుకొచ్చుడే. జైల్లో వేసుడే.. మరో వైపు 317 జీఓ సవరించాలని బీజేపీ చేస్తున్న పోరాటంని డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా కేసీఆర్‌ చేస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు.

First published:

Tags: Bandi sanjay, CM KCR, Telangana bjp

ఉత్తమ కథలు