హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: బీఆర్ఎస్ ఆవిర్భవించాక.. ఓవైసీని దూరం పెట్టిన సీఎం కేసీఆర్.? అసలు వ్యూహం ఇదేనా..

Telangana: బీఆర్ఎస్ ఆవిర్భవించాక.. ఓవైసీని దూరం పెట్టిన సీఎం కేసీఆర్.? అసలు వ్యూహం ఇదేనా..

సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ

సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ

CM KCR: జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్న గులాబీ అధినేత.. ఎంఐఎంతో దోస్తీ కొనసాగిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ ఓటర్లకు దూరమవుతామనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంఐఎం పార్టీకి దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌(BRS)(గా మారిన తర్వాత.. సీఎం కేసీఆర్ (CM KCR) కూడా తన స్ట్రాటజీని మార్చినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ(Telangana)తో మరోసారి అధికారం సాధించడంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషంచాలన్న లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్త మిత్రులకు దూరమవుతూ.. పాత మిత్రులకు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలకు మరింత దగ్గరయ్యాడు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి అఖిలేష్ యాదవ్, కుమారస్వామి హాజరయ్యారు. ఐతే కేసీఆర్ పాత మిత్రుడు అసదుద్దీన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య చాలా కాలంగా దోస్తీ ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా ఆవిర్భవించాక.. అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi), కేసీఆర్ (KCR) మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం .. ఆ పార్టీ బీఆర్ఎస్‌గా అవతరించాక మాత్రం.. శుభాకాంక్షలు చెప్పలేదు. డిసెంబరు 9న బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. కర్నాటక నుంచి జేడీఎస్ నేత కుమరస్వామి, ప్రకాశ్ రాజ్ వంటి వారు హాజరయ్యారు కానీ.. అసదుద్దీన్ ఓవైసీ మాత్రం కనిపించలేదు. ఇక ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సంలోనూ ఆయన పాల్గొనలేదు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం.. ఢిల్లీలోనే ఉన్నారు. ఐనప్పటికీ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు ఓవైసీ. ఈ నేపథ్యంలో కేసీఆర్, ఓవైసీల మధ్య గ్యాప్ గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ కావాలనే ఆయన్ను దూరం పెట్టినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్న గులాబీ అధినేత.. ఎంఐఎంతో దోస్తీ కొనసాగిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ ఓటర్లకు దూరమవుతామనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంఐఎం పార్టీకి దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

BRS Party: బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్.. ఈ నేతలకు కీలక పదవులు.. వివరాలి

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014 నుంచీ ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లుంటే.. టీఆర్ఎస్ గెలవాలనుకునేది 16 మాత్రమే. హైదరాబాద్ సీటును మాత్రం మజ్లిస్‌కు వదిలేసింది. సారు.. కారు.. పదహారు నినాదం అదే..! తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వారు మద్దతు తెలుపుతారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను అసదుద్దీన్‌తో పాటు అక్బరుద్దీన్ కూడా సమర్థిస్తుంటారు. ఎంఐఎం బలంగా ఉన్న పాతబస్తీలో టీఆర్ఎస్ కావాలనే డమ్మీ అభ్యర్థులను నిలబెడుతుందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అంతేకాదు ఎంఐఎంతో మద్దతునే జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది.

ఐతే సీఎం కేసీఆర్ ఎత్తుకున్న జాతీయ నినాదం వల్లే.. ఎంఐఎంను బీఆర్ఎస్ దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎంఐఎంతో దోస్తీని కొనసాగిస్తే.. హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తమనకు నష్టం జరిగే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ అధినేత భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మజ్లిస్‌కు దూరంగా జరిగినట్లు సమాచారం.

First published:

Tags: AIMIM, Asaduddin Owaisi, Bharat Rashtra Samithi, CM KCR, Hyderabad

ఉత్తమ కథలు