ప్రముఖ ప్రజాభిప్రాయ విశ్లేషకుడు వేణుగోపాల్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

ప్రముఖ ప్రజాభిప్రాయ విశ్లేషకుడు డాక్టర్ వేణుగోపాల్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మియాపూర్ కార్పొరేటర్ మేక రమేశ్ మృతిచెందడం పట్ల వారి కుటుంబ సభ్యులకు సానూభూతిని తెలిపారు.

news18-telugu
Updated: April 1, 2020, 5:14 PM IST
ప్రముఖ ప్రజాభిప్రాయ విశ్లేషకుడు వేణుగోపాల్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్
  • Share this:
ప్రముఖ ప్రజాభిప్రాయ విశ్లేషకుడు(సెఫాలజిస్ట్), సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మృతిచెందారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలకు ఎంతో విశ్వసనీయత ఉందని, ఆయన చెప్పిన అనేక సర్వే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వేణుగోపాల్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఇదిలావుంటే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మియాపూర్ కార్పొరేటర్ మేక రమేశ్ కూడా మృతిచెందారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు, ఆయన అనుచరులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
First published: April 1, 2020, 5:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading