Home /News /telangana /

CM KCR MINISTER KTR TELANGANA GOVT TO LAUNCH SPACE TECH POLICY FRAMEWORK THROUGH METAVERSE PLATFORM ON APRIL 18 MKS

CM KCR | KTR: అంతరిక్ష రేసులో తెలంగాణ దూకుడు.. 18న మెటావర్స్ వేదికగా స్పేస్ టెక్ పాలసీ..

తెలంగాణ స్పేస్ టెక్ పాలసీ

తెలంగాణ స్పేస్ టెక్ పాలసీ

అంతరిక్ష సాంకేతిక రంగాల రేసులో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ సర్కారు సిద్దమైంది. వర్చువల్ ప్రపంచమైన మెటావర్స్ వేదికగా ఏప్రిల్ 18న తెలంగాణ స్పేస్ టెక్ పాలసీని ఆవిష్కరించనుంది. వివరాలివే..

అంతర్జాతీయంగా అంతరిక్ష రంగంలో వ్యాపార అవకాశాలు క్రమంగా పెరుగుతుండటం, లాంచ్‌ వెహికల్స్, శాటిలైట్‌ వ్యవస్థల తయారీకి భారత్ పట్టుకొమ్మలా ఉంటోన్న దరిమిలా ఈ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు కేసీఆర్ సర్కారు కంకణం కట్టుకుంది. సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఐటీ శాఖ ఇందుకోసం భారీ ప్రణాళికను రూపొందించింది. వర్చువల్ పద్దతిలో అవతార్లుగా ప్రపంచ దిగ్గజాలు పాల్గొంటోన్న భారీ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం తన ‘స్పేస్ టెక్ పాలసీ’ని ఆవిష్కరించనుంది.

ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ సంస్థ వరుస ప్రయోగాలు, వ‌ర్జిన్ గెలాక్టిక్‌ వ్య‌వ‌స్థాప‌కుడు రిచ‌ర్డ్ బ్రాన్స‌న్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తమ బృందాలతో జరిపిన అంతరిక్ష యాత్రలు స్పేస్ రంగంలో వ్యాపార అవకాశాలను విస్తృతం చేశాయి. అన్ని దేశాలూ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటోన్న క్రమంలో శాటిలైట్ల వాడకం, వాటిని నింగిలోకి పంపేందుకు రాకెట్ లాంఛర్ల వినియోగం క్రమంగా పెరుగుతుండటం తెలిసిందే. విశ్వాన్వేషణ, అంతరిక్ష సాంకేతిక రంగాల రేసులో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ సర్కారు సిద్దమైంది.

CM KCR | Chinna Jeeyar : చిన జీయర్‌తో విభేదాలు..కేసీఆర్ కొత్త గురువు ఎవరంటే.. సంచలన అడుగులు


తెలంగాణను ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చేదిశగా ‘స్పేస్‌టెక్‌ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించింది. వర్చువల్‌ ప్రపంచమైన ‘మెటావర్స్‌’వేదికగా ఏప్రిల్ 18న తెలంగాణ తన స్పేస్ టెక్ పాలసీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘స్పేస్‌ టెక్‌’కు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ ముసాయిదాను రాష్ట్ర ఐటీ విభాగం విడుదల చేసింది. స్పేస్‌ టెక్నాలజీపై పట్టున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, జాతీయ సంస్థలు, స్పేస్‌టెక్‌ పరిశ్రమ యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీని రూపొందించారు.

Astrology: శుక్రుడి రాశిపరివర్తనం 2022 : అన్ని రాశులపైనా ప్రభావం.. రేపటి నుంచి పెను మార్పులు!


తెలంగాణలో అంతరిక్ష రంగ ఉత్పత్తులు, సేవలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్య శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలను స్పేస్ పాలసీ నిర్దేశిస్తుంది. స్పేస్‌ లాంచ్‌ వెహికల్స్, శాటిలైట్‌ వ్యవస్థల తయారీకి ఊతమిచ్చే విధానాలనూ ఇందులో పొందుపర్చారని తెలుస్తోంది. అంతరిక్ష సాంకేతికతను వ్యవసాయం, బీమా, పట్టణ ప్రణాళిక అభివృద్ధి, విపత్తుల నిర్వహణ, పర్యావరణం, సహజ వనరులు, ఇంటర్నెట్, కమ్యూనికేషన్‌ రంగాల్లో వినియోగించేందుకు అవసరమైన ఉత్పత్తులు, సేవలపై దృష్టి పెట్టనున్నారు.

Mahesh Bank: సినిమాను మించిన థ్రిల్లర్: చరిత్రలో ఖరీదైన దర్యాప్తు -సీపీ CV Anand షాకింగ్ కామెంట్స్


అంతరిక్ష సాంకేతికత పరిశ్రమకు అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరుగుతున్నా అందులో భారత్‌ వాటా కేవలం రెండు శాతంగానే ఉంది. ఇస్రోకు వచ్చే ఆర్డర్ల రూపంలోనే అది ఉంది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెంచేందుకు ఇప్పటికే కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం, ఇస్రో, కేంద్ర అంతరిక్ష విభాగం వేర్వేరు స్పేస్‌ పాలసీలను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కూడా ఈ రేస్‌లో నిలిచేలా ప్రత్యేక పాలసీ తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్రానికి గుర్తింపుతోపాటు పలు కోణాల్లో ఆర్థికాభివృద్ధికీ తోడ్పడుతుందని భావిస్తోంది.

PM Kisan: రైతులకు శుభవార్త : బ్యాంకు ఖాతాల్లోకి రూ.2000 -ఎల్లుండే జాబితా.. మీ పేరుందా?


ఇప్పటికే హైదరాబాద్‌లో ఎయిరోస్పేస్, హార్డ్‌వేర్, జనరల్‌ ఇంజనీరింగ్‌ పార్కులు, అతిపెద్ద ప్రోటో టైపింగ్‌ సెంటర్‌ ‘టీ–హబ్‌’ఉన్నాయి. ఇవన్నీ అంతరిక్ష రంగ కార్యకలాపాలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. అంగారక గ్రహం వద్దకు ఇస్రో పంపిన ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’విడిభాగాల్లో 30 శాతం హైదరాబాద్‌లో తయారైనవేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కృత్రిమ మేథ (ఏఐ), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగుమెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), 3డీ ఇమేజింగ్, బ్లాక్‌చెయిన్‌ వంటి అత్యున్నత సాంకేతికతల కలయికతో రూపొందించిన వర్చువల్ ప్రపంచమైన మెటావర్స్‌ వేదికగా ఏప్రిల్ 18న టీ సర్కారు పాలసీ ప్రకటించనుంది. ఈ కార్యక్రమంలో అధికారులు నేరుగా కాకుండా వర్చువల్ గా అవతార్ రూపాల్లో పాల్గొంటారు. స్పేస్‌టెక్‌ పాలసీ ప్రత్యేకతలు, మెటావర్స్‌ ద్వారా విడుదలకు సంబంధించిన వివరాలను రెండు మూడు రోజుల్లో పూర్తిగా వెల్లడిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, It department, KTR, Minister ktr, Satellite, Space, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు