CM KCR : ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం.. పది అంశాలపై ప్రధానికి వినతి ...

ప్రధాని మోదీతో సమావేశం అయిన సీఎం కేసీఆర్

CM KCR : ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. సుమారు 45 నిమిషాలపాటు కొనసాగిన సమావేశంలో పలు అంశాలు చర్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రం అదించారు.

  • Share this:
    ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. మోదీకి పలు అంశాలపై వినతి పత్రాలను అందజేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయాలని కోరారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు.

    మరోవైపు హైదరాబాదు-నాగపూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయలని ప్రధానిని కోరారు. ఇక ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అదనపు నిధులు ఇవ్వాలని విజ్ఝప్తి చేశారు. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీకి నిధులు మంజూరు చేయడంతోపాటు, హైదరాబాద్‌లో ఐఐఎంను ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు.

    ఇది చదవండి : డబుల్ ఇళ్లను ఆక్రమించుకున్న లబ్ధిదారులు.. తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశం


    కాగా గురువారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం ఒక రోజు ముందుగానే వెళ్లిన సీఎం కేసిఆర్ పర్యటన తిరిగి శుక్రవారమే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా మరో రెండు రోజుల పాటు ఆయన పర్యటనను రెండు రోజుల పాటు పొడగించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌తో ఆయన సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    ఇది చదవండి : మంత్రి హరీష్ రావు .. పెద్ద నీచుడు.. ఆయనపై వ్యవహారంపై ప్రజలు తూ.. అంటున్నరు...!

    అయితే ప్రధాని భేటితో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల వాటాపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై కూడా చర్చిస్తారని ముందుగా ప్రచారం జరిగింది.. కాగా తెలంగాణ ప్రభుత్వం నీటీ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతోపాటు విభజన చట్టంలోని అంశాల అమలు , ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సహాయం లాంటీ అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్టు సమాచారం.
    Published by:yveerash yveerash
    First published: