Home /News /telangana /

CM KCR MEETS PM MODI AT DELHI AND DISCUTION ABOUT KRISHNA WATER DISPUTE VRY

CM KCR : ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ సమావేశం.. కృష్ణా జలాల వివాదంపై చర్చ

CM KCR

CM KCR

CM KCR : గత మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జలాల వివాదంతో పాటు పలు పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.

    మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసిఆర్  ప్రధాన మోదీతో సమావేశం అయ్యారు. ప్రధానితో సమావేశంలో కృష్ణా జలాల వివాదంపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధానితో సీఎం కేసిఆర్ చర్చించనున్నారు.

    కాగా గురువారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం ఒక రోజు ముందుగానే వెళ్లిన సీఎం కేసిఆర్ పర్యటన తిరిగి శుక్రవారమే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా మరో రెండు రోజుల పాటు ఆయన పర్యటనను రెండు రోజుల పాటు పొడగించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరి కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. శనివారం మధ్యాహ్నం జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌తో ఆయన సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    ముఖ్యంగా ప్రధాని భేటితో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల వాటాపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై కూడా చర్చించనున్నట్టు సమాచారం. కాగా తెలంగాణ ప్రభుత్వం నీటీ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతోపాటు విభజన చట్టంలోని అంశాల అమలు , ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సహాయం లాంటీ అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్టు సమచారం.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Delhi, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు