HOME »NEWS »TELANGANA »cm kcr meets home minister amit shah request to release aid for flood effected telangana ba

KCR meet Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ

KCR meet Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ
అమిత్ షాను కలిసిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల తెలంగాణలో భారీ వరదలు వచ్చి, పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికంగా సాయం చేయాలని కోరారు.

 • Share this:
  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల తెలంగాణలో భారీ వరదలు వచ్చి, పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికంగా సాయం చేయాలని హోంమంత్రి అమిత్ షాను సీఎం కేసీఆర్ కోరారు. విపత్తుల నిర్వహణ విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. అందుకే అమిత్ షాను కలిసి రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. అమిత్ షాతో భేటీకి ముందు కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం అయ్యారు. షెకావత్‌ నివాసంలో సుమారు గంటపాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించినట్లు సమాచారం. తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతులున్నాయి.

  కరోనా పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్... వెబ్‌లో అక్షింతలు, అతిథుల ఇంటికే వివాహ భోజనం  ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..

  Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

  మూడు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మొదటి రోజే ఆయన కేంద్ర హోంమంత్రి, జలశక్తి మంత్రులను కలవడం విశేషం. ప్రధాని మోదీని కలుస్తారా? లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

  TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు

  ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి

  కరోనా కేసులు లేని ఏకైక పర్యాటక ప్రదేశం.. హనీమూన్ కోసం బెస్ట్ ప్లేస్

  రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. దేశంలో కొత్త పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు రోజు డిసెంబర్ 9న కేసీఆర్ ఈ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ ఆత్మ గౌరవానికి ప్రతికగా నిలుస్తుందన్నారు. "దేశ రాజధానిలో ఉన్న ప్రభుత్వ భ‌వనాలు అవసరాలకు తగినట్టుగా లేవు. పైగా అవి గత వలస పాలనకు చెందినవి. ఈ క్రమంలోనే ఇలాంటి నిర్మాణం ఎప్పుడో చేపట్టాల్సింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు భారతదేశ ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు గర్వకారణం. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలి" అని సీఎం కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.

  విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

  ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి..

  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం భూమి కేటాయించింది.  ఆ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేతలంతా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మళ్లీ వారితోనే కేసీఆర్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:December 11, 2020, 21:26 IST