చిన్న జీయర్‌ను కలిసి.. ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్

మే 29న కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ స్వయంగా కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తారు.

news18-telugu
Updated: May 27, 2020, 10:11 PM IST
చిన్న జీయర్‌ను కలిసి.. ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్
చిన్న జీయర్‌ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ చిన్న జీయర్ స్వామిని కలిశారు. ప్రగతి భవన్‌లో కరోనావైరస్, లాక్‌డౌన్, ఆర్థిక వ్యవస్థ, నియంత్రిత పంటల సాగు, రాష్ట్ర అవరతణ వేడుకలపై సమీక్ష అనంతరం.. నేరుగా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న చిన్న జీయర్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ చిన్న జీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కొండ పోచమ్మసాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిన్న జీయర్‌ను ఆహ్వానించారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 29న కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ స్వయంగా కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తారు.

ఐతే అంతకంటే ముందు ఉదయం 4 గంటలకు యాగం నిర్వహించనున్నారు. ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌజ్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.. ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు. తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. కేసీఆర్ దంపతుల చేత చిన్న జీయర్ ఈ యాగం చేయించనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం ఆశ్రమానికి వెళ్లి చిన్నజీయర్‌ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్.
First published: May 27, 2020, 10:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading