టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ కానున్న గులాబీ బాస్.. వాటిపై చర్చ

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

news18-telugu
Updated: September 9, 2020, 10:36 PM IST
టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ కానున్న గులాబీ బాస్.. వాటిపై చర్చ
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రేపు పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ భేటీలో కేసీఆర్ ఎంపీలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 14 నుండి మొదలుకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశంలో ఆయన కేంద్రం తీరును తప్పుబడుతున్నారు. దీంతో పాటు కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టి విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు.
Published by: Kishore Akkaladevi
First published: September 9, 2020, 10:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading