హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: నేడు సీఎం కేసీఆర్ కీలక భేటీ.. కొత్త పార్టీపై మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో చర్చ

Telangana: నేడు సీఎం కేసీఆర్ కీలక భేటీ.. కొత్త పార్టీపై మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో చర్చ

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR: దసరా తర్వాత కరీంనగర్‌‌లో భారీ సభకు కేసీఆర్‌‌ ప్లాన్‌‌ చేస్తున్నట్లు సమాచారం. టీఆర్‌‌ఎస్‌‌ పార్టీని ఏర్పాటు చేశాక.. మొదటి బహిరంగ సభ కరీంనగర్‌‌లోనే పెట్టారు. అదే సెంటిమెంట్‌‌ కొనసాగిస్తూ... కరీంనగర్‌‌ సభలో నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త పార్టీకి సర్వం సిద్ధమైంది. అక్టోబరు 5న దసరా సందర్భంగా కొత్త పార్టీని ఆయన ప్రకటించనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయనున్నారు. ఐతే  జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో మంత్రులు,  33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం మంత్రులు, జిల్లా అధ్యక్షులకు శనివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా ఆహ్వానాలు అందాయి. అందరూ ప్రగతి భవన్‌కు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ కోరారు. దసరా రోజున కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో.. అందుకు సన్నాహకంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.

  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి ముఖ్యమంత్రులతో సమాలోచనలు చేశారు. ఇతర పార్టీల నేతలతోనూ చర్చలు జరిపారు. ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు, రైతు నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం కొత్త పార్టీ ఏర్పాటుకు (KCR New Party) దసరా (Dussehra)ను ముహూర్తంగా నిర్ణయించారు. దసరా రోజున తెలంగాణభవన్‌లో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి.. జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.శనివారం వరంగల్‌ జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన సభలో కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చారు. జై తెలంగాణ, జై భారత్‌ నినాదాలు చేయడంతో..కొత్త పార్టీ ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దసరా లోపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనూ సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశముంది.

  అక్టోబరు 5న తెలంగాణ భవన్‌లో‌లో టీఆర్ఎస్ (TRS) రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆ భేటీలో నేతలంతా కలిసి జాతీయ పార్టీపై తీర్మానం చేస్తారు. టీఆర్‌‌ఎస్‌‌ ఎన్నికల గుర్తయిన కారునే జాతీయ పార్టీకి కూడా తీర్మానం చేయనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపినట్లు తెలిసింది. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించే తీర్మానాన్ని ఇప్పటికే ఖరారు చేశారు. అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌‌ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. పార్టీ సెక్రటరీ జనరల్‌‌ కె. కేశవరావుతో పాటు రాష్ట్ర కార్యవర్గం ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేయనుంది. అనంతరం కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. TRS పేరును BRS (భారతీయ రైతు సమితి)గా మార్చనున్నట్లు సమాచారం.

  దసరా తర్వాత కరీంనగర్‌‌లో భారీ సభకు కేసీఆర్‌‌ ప్లాన్‌‌ చేస్తున్నట్లు సమాచారం. టీఆర్‌‌ఎస్‌‌ పార్టీని ఏర్పాటు చేశాక.. మొదటి బహిరంగ సభ కరీంనగర్‌‌లోనే పెట్టారు. అదే సెంటిమెంట్‌‌ కొనసాగిస్తూ... కరీంనగర్‌‌ సభలో నిర్వహిస్తారని తెలుస్తోంది. అనంతరం ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌‌ యోచిస్తున్నారు. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, బీసీల సమస్యలే కేసీఆర్‌‌ జాతీయ పార్టీ ఎజెండాగా ఉండబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై దేశవ్యాప్తంతా విస్తృత ప్రచారం ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Hyderabad, Telangana, Trs

  ఉత్తమ కథలు