Home /News /telangana /

CM KCR MAY TAKE FINAL CALL ON SCHOOLS REOPENING IN TELANGANA ON JANUARY 11 AK

Telangana: తెలంగాణలో పాఠశాలల ప్రారంభం.. ఆ రోజే సీఎం కేసీఆర్ నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Schools Reopening: ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి ? ఏ విధంగా నిర్వహించాలి ? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి ? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం సీఎ కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

    తెలంగాణలో పాఠశాలలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ అంశంపై ఈ నెల 11న జరగబోయే సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో పాఠశాలలను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయం మీద జనవరి 11న సీఎం కేసీఆర్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి ? ఏ విధంగా నిర్వహించాలి ? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి ? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

    దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాల ప్రారంభానికి సంబంధించి తేదీలు ప్రకటించాయి. పదో తరగతి పరీక్షలకు ముందు కచ్చితంగా తరగతులు నిర్వహించాల్సి ఉండటంతో.. పదో తరగతితో పాటు మరికొన్ని ఎగువ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సంక్రాంతి తరువాత పలు తరగతులను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    పాఠశాలల ప్రారంభంతో పాటు పలు ఇతర కీలక అంశాలపై కూడా సీఎం కేసీఆర్ ఈ నెల 11న సమీక్ష చేపట్టనున్నారు. రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు, పార్ట్.బి. లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.

    రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చిస్తారు. వ్యాక్సీన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రధాన్యతా క్రమంలో వ్యాక్సీన్ ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షిస్తారు. గ్రామాలకు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా? వాటి వినియోగం ఎలా ఉంది ? తదితర అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పరోగతిని సమీక్షిస్తారు. ఆ రోజు ఉదయం 11.30 గంటల నుండి రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Schools reopening, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు