ఆర్టీసీ కార్మికులకు మరో షాక్... సమ్మె విరమించినా...

కార్మికులు చట్టవిరుద్ధంగా 46 రోజుల పాటు సమ్మె చేశారని వాదిస్తున్న ప్రభుత్వం... వాళ్లు తిరిగి విధుల్లో చేరడానికి ముందుకొస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

news18-telugu
Updated: November 19, 2019, 2:01 PM IST
ఆర్టీసీ కార్మికులకు మరో షాక్... సమ్మె విరమించినా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేడు సాయంత్రం ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమై సమ్మె విరమించే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరడానికి ముందుకొచ్చినా... ప్రభుత్వం వీరి విషయంలో ఎలా వ్యవహరిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కార్మికులు చట్టవిరుద్ధంగా 46 రోజుల పాటు సమ్మె చేశారని వాదిస్తున్న ప్రభుత్వం... వాళ్లు తిరిగి విధుల్లో చేరడానికి ముందుకొస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో దీనిపై వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కార్మిక సంఘాల స్పందనను బట్టి దీనిపై స్పందించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కార్మికులు భేషరతుగా విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉందని సమాచారం. తాము బేషరతుగా విధుల్లో చేరుతున్నట్టు కార్మికులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు...భవిష్యత్‌లో సమ్మె చేయబోమని లిఖితపూర్వక ప్రమాణ పత్రం ఇవ్వాలని సర్కార్ అడగబోతున్నట్టు సమాచారం. ప్రభుత్వ షరతులను అంగీకరించిన కార్మికులనే విధుల్లోకి తీసుకోవాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దీనికి కార్మికులు అంగీకరించని పక్షంలో లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని సర్కార్ భావిస్తోందని తెలుస్తోంది. లేబర్ కోర్టులో సమ్మె చట్టవిరుద్ధమని తేలితే...కార్మికులందరికీ వీఆర్ఎస్ ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూసిన తరువాతే దీనిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని... కార్మికులు సమ్మె విరమిస్తే... ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
First published: November 19, 2019, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading