ఆర్టీసీ కార్మికులతో చర్చలకు కేసీఆర్ ఓకే... షరతులు వర్తిస్తాయి..?

ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మిక సంఘాల నేతలు చర్చించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: October 22, 2019, 4:01 PM IST
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు కేసీఆర్ ఓకే... షరతులు వర్తిస్తాయి..?
కేసీఆర్, ఆర్టీసీ
news18-telugu
Updated: October 22, 2019, 4:01 PM IST
గత 18 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించిన హైకోర్టు ఆర్డర్ కాపీలు ప్రభుత్వానికి అందాయి. దీనిపై ఏం చేయాలనే అంశంపై మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఓ వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే... మరోవైపు కార్మికులతో చర్చలు జరపాలని సీఎం కేసీఆర్ సమావేశంలో పాల్గొన్న అధికారులు, మంత్రికి సూచించినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్లపై చర్చించేందుకు సర్కారు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మిక సంఘాల నేతలు చర్చించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమ్మె విరమించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి డిమాండ్లను పక్కనపెడితేనే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఈ అంశంపై హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మొత్తానికి ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.






First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...