కొత్త సచివాలయం నిర్మాణం.. కేసీఆర్‌కు కొత్త సవాల్ ?

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కొత్త సచివాలయం నిర్మాణానికి రూ. 500 కోట్లు ఖర్చవుతాయని గతంలోనే తెలంగాణ సర్కార్ అంచనా వేసింది.

news18-telugu
Updated: June 30, 2020, 7:16 AM IST
కొత్త సచివాలయం నిర్మాణం.. కేసీఆర్‌కు కొత్త సవాల్ ?
తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సచివాలయంలోని పాత భవనాల కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన నూతన సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయినట్టే అని అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అంత తేలిగ్గా కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందులే. కరోనా కారణంగా మూడు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతాలే ఇచ్చింది తెలంగాణ సర్కార్.

అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కొత్త సచివాలయం నిర్మాణానికి రూ. 500 కోట్లు ఖర్చవుతాయని గతంలోనే తెలంగాణ సర్కార్ అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంత ఖర్చుతో కొత్త సచివాలయ నిర్మాణం చేపడుతుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ అంశాన్ని విపక్షాలు రాజకీయ అస్త్రంగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు కొత్త సచివాలయం ఎందుకని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ప్రభుత్వానికి కొంతమేర ఇబ్బంది కలిగించే అంశమే అనే వాదన వినిపిస్తోంది. అయితే ఎలాంటి ఇబ్బందులనైనా తనదైన శైలిలో అధిగమించే సీఎం కేసీఆర్... కొత్త సచివాలయం నిర్మాణం విషయంలోనూ విపక్షాల విమర్శలకు చెక్ చెబుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఏదేమైనా... కరోనా కాలంలో కొత్త సచివాలయం నిర్మాణం సీఎం కేసీఆర్‌కు సవాల్ కానుందని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
First published: June 30, 2020, 7:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading