హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: మహబూబ్‌నగర్‌లో కొత్త కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR: మహబూబ్‌నగర్‌లో కొత్త కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR: మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్‌ వెంకట్రావును సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన కూర్చీలో కూర్చోబెట్టారు. ఆయనకు పుష్ఫ గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Mahbubnagar (Mahabubnagar)

మహబూబ్ నగర్‌(Mahbubnagar)లో సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటన కొనసాగుతోంది. మొదట  జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన  టీఆర్ఎస్ (TRS)  జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత పాలకొండ వద్ద నిర్మించిన కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ వెంకట్రావును సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన కూర్చీలో కూర్చోబెట్టారు. ఆయనకు పుష్ఫ గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఇవాళ్టి నుంచి 58 ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఈ భవనం నుంచే ప్రజలకు సేవలందించనున్నాయి.

MLC Kavitha: సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత.. అవి అందిన తర్వాత విచారణ చేయండి

టీఆర్ఎస్ పార్టీ కొత్త ఆఫీసు ప్రారంభం అనంతరం... పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్ , సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Dharani: అన్నీ అక్రమాలే.. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి.. కేంద్రానికి కాంగ్రెస్ ఫిర్యాదు

సీఎం రాక నేపథ్యంలో పట్టణంలోని జాతీయ రహదారిని సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల దీపాలను ఏర్పాటు చేసి గులాబీ తోరణాలు ఫ్లెక్సీలతో పట్టణాన్ని గులాబీ మయంగా మార్చారు. సీఎం పర్యటనకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదాన ప్రాంగణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. కొన్ని రోజులుగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్ ..ఈ సభలోనూ కేంద్రాన్ని టార్గెట్ చేసే అవకాశముంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంతో.. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసాిందే. ఈ అంశంపైనా సీఎం కేసీఆర్ స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తెలంగాాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణాలను టీఆర్ఎస్ చేపట్టింది. కొత్త జిల్లాలను ప్రకటించిన తర్వాత.. అక్కడ కూడా ఆఫీసులను నిర్మించారు. అంతేకాదు నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ భవనాలను నిర్మించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఏర్పాటైన కలెక్టర్ భవనాల సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ భవన సముదాయాలను కూడా ఆయన ప్రారంభించారు.

First published:

Tags: CM KCR, Mahbubnagar, Telangana

ఉత్తమ కథలు