• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • CM KCR MADE PHONE CALL TO SARPANCH DIRECTLY TO TAKE ADOPTION OF VILLAGE VRY

CM KCR : హలో.. నేను వస్తున్నా అంటూ సర్పంచ్‌కు ఫోన్‌ చేసిన సీఎం కేసిఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి అనే గ్రామంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే వాసాల మర్రి సర్పంచ్‌ అంజయ్య ఫోన్‌ చేసి మాట్లాడారు.

CM KCR : ముఖ్యమంత్రి కేసిఆర్ నేరుగా ఓ సర్పంచ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు..తాను గ్రామానికి వస్తున్నాని...అందుకు వసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు..దీంతో పాటు గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తానని చెప్పారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ మీ గ్రామానికి వస్తుందంటూ వివరించారు.

  • Share this:
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి అనే గ్రామంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే వాసాల మర్రి సర్పంచ్‌ అంజయ్య ఫోన్‌ చేసి మాట్లాడారు.  { ఫైల్ ఫోటో)


కాగా వాసాల మర్రి గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు..ఆ గ్రామానికి
గతంలో వస్తానని ప్రకటించినా.. కరోనా కారణంగా రాలేక పోయానని చెప్పారు. దీంతో ఈనెల 22న దత్తత గ్రామంలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్‌ సర్పంచ్‌కు ఫోన్ చేసి చెప్పారు.  { ఫైల్ ఫోటో)


ఈ క్రమంలోనే సర్పంచ్‌కు రెండు పనులు చేయాలని సూచించారు..అవి గ్రామం అంతా కలిసి సాముహిక భోజనం చేద్దామని, అనంతరం గ్రామ సమస్యలపై చర్చించేందుకు సభ ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. { ఫైల్ ఫోటో)


ఇక సామూహిక భోజనం చేయడంతో పాటు గ్రామ సభ నిర్వహించేందుకు ఖాళీ స్థలాన్ని చూడాలని అంజయ్యకు సూచించారు. సీఎం ఫోన్ అనంతరం వాసాలమర్రిలో ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. { ఫైల్ ఫోటో)


కాగా, గ‌త సంవత్సరం జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్‌ పర్యటన ముగించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో భాగంగా వాసాలమర్రిలో ఆగి, స్థానికుల‌తో మాట్లాడారు. గ్రామాభివృద్ధిపై చర్చించి, ఆ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు.
Published by:yveerash yveerash
First published: