CM KCR LIKELY TO SKIP PM NARENDRA MODI HYDERABAD HE WILL VISIT BENGALURU ON 26TH MAY SK
CM KCR vs PM MODI: ఈసారి కూడా కలిసేది లేదు.. ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ డుమ్మా
నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
CM KCR vs PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ మే 26న హైదరాబాద్లో పర్యటిస్తుండగా.. ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు. అదే రోజు ఆయన బెంగళూరుకు వెళ్తున్నారు.
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్కు అస్సలు పడడం లేదు. ప్రధాని మోదీ టార్గెట్గా సీఎం కేసీఆర్ (CM KCR) కొంత కాలంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ కూడా టీఆర్ఎస్పై విరుచుకుపడుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ప్రధాని మోదీ (PM Modi Hyderabad Tour) మే 26న హైదరాబాద్కు వస్తున్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే... ప్రొటోకాల్ ప్రకారం సీఎంలు ఆహ్వానం పలుకుతారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ సీన్ కనిపించడం లేదు. ప్రధాని మోదీ (PM Narendra Modi) ముచ్చింతల్లో రామానుజచార్యుల విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు. తాజాగా మరోసారి మోదీ పర్యటనకు డుమ్మా కొట్టబోతున్నారు తెలంగాణ సీఎం.
ప్రధాని మోదీ మే 26న తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఐతే అదేరోజు సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అనంతరం మే 26న బెంగళూరులో పర్యటిస్తారు సీఎం కేసీఆర్. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామితో భేటీ అవుతారు. దేశంలో తాజా రాజకీయలపై చర్చిస్తారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడం ఇది మూడోసారి. 2020 నవంబరు 28న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటించారు. కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారు చేసిన.. భారత్ బయోటెక్ కార్యలయాన్ని సందర్శించారు. ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని... పీఎంవో కార్యాలయం సమాచారం ఇవ్వడంతో.. సీఎం కేసీఆర్ వెళ్లలేదు. ప్రధాని పర్యటనలో పాల్గొనాలని అనుకున్నానని.. కానీ వద్దని చెప్పడంతో.. వెళ్లలేదని గతంలో ఓ సందర్భంలో సీఎం కేసీఆర్ చెప్పారు. మోదీ వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆయన వచ్చారని టీఆర్ఎస్ విమర్శించగా.. బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది.
ఇక ఫిబ్రవరిలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటించారు. ముచ్చింతల్లోని చిన్నజీయర్ ఆశ్రమంలో సమతా మూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఇక్రిశాట్లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. వాటికి కూడా సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. అనారోగ్య సమస్యల కారణంగానే ప్రధాని మోదీ పర్యటనకు వెళ్లలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మే 26న ప్రధాని మోదీ హైదరాబాద్కువ వస్తుండగా.. సీఎం కేసీఆర్ మాత్రం ఆ రోజు బెంగళూరుకు వెళ్తున్నారు. దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధాని మోదీ హైదరాబాదకు వస్తే.. సీఎం కేసీఆర్కు భయం పట్టుకుంటుందని అందుకే ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వారి విమర్శలను టీఆర్ఎస్ వారు తిప్పికొడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.