Home /News /telangana /

CM KCR LIKELY TO ANNOUNCE ABOUT 50000 JOB SRECRUITMENT TODAY IN ASSEMBLY AS TRS PREPARING FOR EARLY ELECTIONS MKS

CM KCR: ఒకే సారి 50,000 ఉద్యోగాలు భర్తీ.. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన ఇదే? -ముందస్తు ఎన్నికలు పక్కా!

సీఎం కేసీఆర్(పాత ఫొటో)

సీఎం కేసీఆర్(పాత ఫొటో)

ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే సీఎం కేసీఆర్ ఇవాళ ఒకే సారి 50,000 ఉద్యోగల భర్తీని ప్రకటిస్తున్నారనే వాదన ఉంది. దీనికి సంబంధించి గతేడాది జూన్ లోనే ఆదేశాలిచ్చారు. ఇవాళ్టి ప్రకటన దానికి కార్యరూపమేనని తెలుస్తోంది.

‘ఎవరికేం చేయాలో నాకు బాగా తెలుసు.. నిరుద్యోగుల కోసం బుధవారం ఉదయం అసెంబ్లీలో అద్బఉత ప్రకటన చేయబోతున్నా.. మీరంతా టీవీలు చూడండి..’ అంటూ మంగళవారం నాటి వనపర్తి పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపింది. అదే సమయంలో ముందస్తు ఎన్నికల వేడిని మరింత రాజేసినట్లయింది. సీఎం కేసీఆర్ చేయబోయేది మెగా రిక్రూట్మెంట్ ప్రకటన అని దాదాపుగా అందరికీ అవగతమైనా, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) లేదా సంబంధిత రిక్రూట్మెంట్ బోర్డులు నిబంధనల ప్రకారం చేపట్టే కొలువుల భర్తీని రాజకీయ ఎత్తుగడగా అసెంబ్లీలో ప్రకటిస్తుండటం చర్చనీయాంశమైంది. ముందస్తు వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కొలువుల భర్తీని ప్రకటిస్తున్నారనే వాదన ఉంది. నిజానికి రాష్ట్రంలో ఒకేసారి 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం గతేడాది జూన్ లోనే ఆదేశాలిచ్చారు. ఇవాళ్టి ప్రకటన దానికి కార్యరూపమేనని ఖాయంగా తెలుస్తోంది.

తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ వ్యవస్థ ఎట్టకేలకు గతేడాది నుంచే మనుగడలోకి రావడంతో దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీకి అవకాశం ఏర్పడిందనే అంచనాలున్నాయి. రాబోయే రోజుల్లో ఏర్పడబోయే ఖాళీలను కలిపి మొత్తం 1లక్ష ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. విడతల వారీగా కొలువుల భర్తీని చేపట్టాలని భావిస్తోన్న కేసీఆర్ సర్కారు.. తొలి దశలో ఒకే సారి 50, 000 ఉద్యోగాలను ప్రకటించనున్నారు. ఈ అర లక్ష ఉద్యోగాలు నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్‌మెంట్‌)వేనని తెలుస్తోంది. కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో చేయబోయే ప్రకటన 50 వేల ఉద్యోగాలు భర్తీకి సంబంధించిందేనని తెలుస్తోంది.

Telangana Govt Jobs: బీసీలకు 10ఏళ్ల సడలింపు.. CM KCR శుభవార్త.. దివ్యాంగులకు కూడా..


కొత్త నియామకాలకు ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 2022-23 బడ్జెట్‌లో రూ. 4,000 కోట్లు కేటాయించింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్‌ ప్రసంగంలోనే కొలవుల గురించి ప్రకటించాలని మొదట భావించినా ముఖ్యమంత్రే దీనిపై శాసనసభ వేదికగా వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలిసింది.   గ్రూప్‌ 1, 2, 3, 4లతో పాటు గురుకులాల్లో బోధన సిబ్బంది, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఇతర నియామకాలపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

CM KCRకు భిన్నంగా మంత్రి KTR -విరోధులతోనూ ఆత్మీయ ఆలింగనం -ఈటల ముఖం చూడొద్దనే సస్పెన్షన్?


మెగా కొలువుల జాతరతోపాటే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి డిమాండ్ గా తెరపై ఉన్న ‘జాబ్ క్యాలెండర్’ ప్రకటనను కూడా సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్లు, వాటి షెడ్యూల్‌ తదితర వివరాలతోపాటే కేసీఆర్ జాబ్‌ క్యాలెండర్‌ను సభ ముందు ఉంచుతారని సమాచారం. గతేడాది జూలై 13న నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దాంతో, అధికారులు కసరత్తు చేసి రాష్ట్రంలో 56,979 ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికను సమర్పించారు. దానిపై క్యాబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అంత తక్కువ ఖాళీలను చూపడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని, 80 వేల వరకు ఖాళీలకు అవకాశం ఉండొచ్చన్నది ఆయన అభిమతమని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Women's day 2022: నన్నెవరూ భయపెట్టలేరు: CM KCRతో విభేదాల క్రమంలో గవర్నర్!


సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో చేయబోయే ప్రకటనలో అసలు తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే లెక్కలను కూడా వెల్లడించేసి, వాటిని ఎప్పుడెప్పుడు భర్తీ చేసేది జాబ్ క్యాలెండర్ లో పేర్కొంటారని తెలుస్తోంది. తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల వరకు ఉంటుందని నిరుద్యోగ సంఘాలు చెబుతున్నా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద 24 లక్షల మందికిపైగా రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనా సీఎం కేసీఆర్ అడ్రెస్ చేస్తారని తెలుస్తోంది. గడిచిన మూడు నెలలుగా వరుస బహిరంగ సభలు నిర్వహిస్తోన్న కేసీఆర్.. నేటి మెగా రిక్రూట్మెంట్ ప్రకటనతో ముందస్తు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసినట్లవుతుందనే అభిప్రాయాలున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Government jobs, Telangana Assembly, Telangana Budget 2022, Telangana notifications, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు