Home /News /telangana /

CM KCR LED TRS BLOCKED ALL ADVERTISEMENT SPACE IN HYDERABAD AHEAD OF BJP NATIONAL EXECUTIVE MEET AND PM MODI RALLY MKS

TRS | BJP : బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్.. జాతీయ భేటీ, మోదీ సభ వేళ ఎటుచూసినా కేసీఆర్!

హైదరాబాద్ లో కేసీఆర్ ప్రచార చిత్రాలు

హైదరాబాద్ లో కేసీఆర్ ప్రచార చిత్రాలు

జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభ వేళ బీజేపీకి టీఆర్ఎస్ అనూహ్య షాకిచ్చింది. హైదరాబాద్ కాషాయమయం అయ్యేలా ప్రచారం నిర్వహించాలని కమలనాథులు భావించగా, సిటీలోని యాడ్ స్సేస్ మొత్తాన్ని కేసీఆర్ సర్కారు బ్లాక్ చేసింది..

ఇంకా చదవండి ...
తెలంగాణ (Telangana)లో క్రమంగా పుంజుకున్న బీజేపీ (BJP) ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలనే పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తున్నది. ఆ క్రమంలోనే తరచూ బడా నేతలను రప్పిస్తూ భారీ సభలు నిర్వహిస్తున్నది. ముందస్తు ఎన్నికలు ఉండొచ్చనే ప్రచారం నేపథ్యంలో ఈ ఏడాది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను (BJP National Executive Meet) సైతం హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు.

ప్రధాని మోదీ సహా అగ్రనేతలంతా రెండు రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. జాతీయ భేటీతోపాటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ భారీ సభ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సిటీలో ప్రచారాన్ని హోరెత్తించాలని బీజేపీ భావించింది. కానీ కమలనాథులకు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు భారీ షాకిచ్చింది. హైదరాబాద్ లో ఎటు చూసినా సీఎం కేసీఆరే కనిపించేలా ప్రకటనల స్థలాలను ప్రభుత్వం ముందస్తుగానే బుక్ చేసుకుంది. (TRS Blocked Ad Space) వివరాలివే..

CM KCR | Governor : తమిళిసైతో కేసీఆర్ తేనీటి విందు.. టీఆర్ఎస్ చీఫ్ టార్గెట్ మార్చుకున్నారా?


ఈ వారంలోనే అంటే, జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. భద్రత, పార్కింగ్, ప్రతినిధులు బస చేసే భద్రత ఏర్పాట్లపై అధికారులతో చర్చలు నిర్వహించిన కమలనాథులు.. మోదీ సభకు 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సందర్భంలో హైదరాబాద్ కాషాయమయం అయ్యేలా పెద్ద ఎత్తున ప్రచార చిత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని బీజేపీ భావించింది. బీజేపీ ప్రచారంపై టీఆర్ఎస్ నీరు జల్లింది. ప్రకటనల కోసం ముందస్తుగానే మొత్తం స్పేస్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ బుక్ చేసుకుంది.

Rythu Bandhu : ఇవాళ్టి నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. కొత్తగా 3.64 లక్షల మందికి రైతుబంధు


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోదీ సభ వేళ హైదరాబాద్ మెట్రో పిల్లర్లు, బస్టాప్‌లు, విద్యుత్ స్తంభాలపై ప్రకటనల స్థలాలాలు అన్నిటినీ టీఆర్ఎస్ సర్కారు బ్లాక్ చేసింది. నగరం వ్యాప్తంగా పెద్దఎత్తున సీఎం కేసీఆర్ ఫొటోతో కూడిన తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రకటనలు వెలిశాయి. సమాచార ప్రచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సదరు ప్రకటనలు అన్నింటిలో ‘తెలంగాణ అమలు చేస్తుంది.. దేశం అనుసరిస్తుంది..’ అనే నినాదం రాసుండటం గమనార్హం.

హైదరాబాద్ మెట్రో పిల్లర్లు, బస్ స్టాపుల్లో సీఎం కేసీఆర్ ప్రచార చిత్రాలు (image credit: pynr)

Petrol Diesel Prices : పెట్రోల్, డీజిల్ ధరలు భారీ తగ్గింపు? -జీఎస్‌టీ కౌన్సిల్ భేటీపై ఉత్కంఠ


రాబోయే వారం పదిరోజుల సమయానికిగానూ టీసర్కారు హైదరాబాద్ లోని యాడ్ స్పేస్ మొత్తాన్ని బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. సిటీ వ్యాప్తంగా సీఎం ఫొటోతో కూడిన రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పింఛన్‌, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతు భీమా తదితర పథకాల ప్రచార చిత్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ సహా బీజేపీ కీలక నేతలంతా రెండు రోజులపాటు సిటీలో ఉన్న సమయంలో ఎటుచూసినా సీఎం కేసీఆర్ చిత్రాలే కనిపించేలా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

TS Inter Result 2022 : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు -న్యూస్ 18 వెబ్‌సైట్‌లోనూ నేరుగా..


నిజానికి బీజేపీ ముఖ్య కార్యక్రమాల వేళ టీఆర్ఎస్ యాడ్ స్పేస్ ను పూర్తిగా బ్లాక్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి వారు సిటీలో కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాల్లో బీజేపీ ప్రకటనలకు చోటులేకుండా చేసింది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ అభద్రతా భావంతోనే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారని, యాడ్ స్పేస్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా బ్లాక్ చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.


Transgender అందాల పోటీలు.. Miss International Queen 2022 రవెనా.. విశేషాలివే..


బీజేపీ కార్యక్రమాలకు తెలంగాణ పోలీసులు కరోనా పేరుతోనూ ఆంక్షలకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించినట్లు ‘ది పయనీర్’ రిపోర్టు చేసింది. ప్రకటనలు, ప్రచార చిత్రాల విషయంలో కేసీఆర్ జిమ్మిక్కులు పనిచేయవని, హోర్డింగ్‌లు కాకపోతే, తాము న్యూస్ పేపర్లు, టీవీల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తామని, టీఆర్ఎస్ వంకర బుద్ధిని సోషల్ మీడియాలోనూ ఎండగడతామని సుభాష్ వ్యాఖ్యానించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Hyderabad, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు