హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR దుమారం వేళ కేంద్రం సంచలనం.. KCR పాలనకు కితాబు.. అమెరికాకు దీటుగా తెలంగాణ: గడ్కరీ

KTR దుమారం వేళ కేంద్రం సంచలనం.. KCR పాలనకు కితాబు.. అమెరికాకు దీటుగా తెలంగాణ: గడ్కరీ

హైవేల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు

హైవేల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు

ఏపీ అధ్వానం కామెంట్ల రచ్చ కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ అద్భుతం అంటూ కేంద్ర సర్కారు కితాబివ్వడం గమనార్హం. తెలంగాణ ప్రగతిశీల, సంపన్న రాష్ట్రం అని, దేశంలో ప్రగతి, అభిృద్ధి సూచికలకు తెలంగాణే గీటురాయి అని కేంద్రం అంటోంది.

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ చిచ్చుకు కారణమైంది. అన్ని పార్టీల నేతలు పరస్పరం దూషణలు, సవాళ్లకు దిగారు. చివరికి తన ఉద్దేశం అదికాదంటూ కేటీఆర్ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ‘నా కామెంట్లు ఏపీ స్నేహితులను బాధించినట్లున్నాయి.. సీఎం జగన్ నాకు సోదరుడు.. ఆయన నాయకత్వంలో ఏపీ పురోగమించాలని కోరుకుంటున్నా..’ కేటీఆర్ అర్ధరాత్రి తర్వాత డ్యామేజ్ కంట్రోల్ ట్వీట్ చేశారు. కాగా, ఏపీ అధ్వానం కామెంట్ల రచ్చ కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ అద్భుతం అంటూ కేంద్ర సర్కారు కితాబివ్వడం గమనార్హం. తెలంగాణ ప్రగతిశీల, సంపన్న రాష్ట్రం అని, దేశంలో ప్రగతి, అభిృద్ధి సూచికలకు తెలంగాణే గీటురాయి అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పొగడటం సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ ముదిరిన క్రమంలో కేంద్రం గడ్కీర వ్యాఖ్యల మర్మం ఏమిటానే చర్చ జరుగుతోంది..

బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యుద్దం ప్రకటించడం, ఆ దిశగా ధర్నాలు, రాజకీయ ఫ్రంట్ ప్రయత్నాలు చేసి, ప్రస్తుతం ప్రత్యామ్నాయ జాతీయ అజెండా రూపకల్పనలో ఉండటం తెలిసిందే. గడిచిన ఏడాది కాలంగా కేంద్రాన్ని తెలంగాణ-రాష్ట్రాన్ని కేంద్రం తిట్టిపోయని, తప్పుపట్టని అంశమంటూలేదు. కేసీఆర్ లేదా కేటీఆర్ చేసే ప్రతి విమర్శకు కేంద్ర మంత్రులు ఆధారాలతో సహా దీటుగా కౌంటర్లిస్తున్నారు. అయితే, బీజేపీలో ప్రధాని పదవికి మోదీతో పోటీపడగల ఏకైక నేతగా పేరున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం తన సహచరులకు భిన్నంగా, తెలంగాణతో ఫ్రెండ్లీగా వ్యవహారం సాగిస్తున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అధ్వానంగా మారిందని టీబీజేపీ ఆరోపిస్తోంటే, గడ్కరీ మాత్రం తెలంగాణ అద్బుతాలు సాధిస్తోందని కితాబిచ్చారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో తెలంగాణను అమెరికాకు దీటుగా అభివృద్ది చేస్తామనీ గడ్కరీ హామీ ఇచ్చారు.

Telangana: ఏపీ పుష్పలా మరో భర్తకు షాకింగ్ సర్‌ప్రైజ్.. ఇష్టంలేని పెళ్లి చేశారని అతని గొంతు కోసింది..


హైదరాబాద్‌లో నేషనల్‌ హైవే అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో శుక్రవారం.. రూ.8006 కోట్లు విలువ చేసే సుమారు 460 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్‌హెచ్‌-161 రెండు రోడ్లను ప్రారంభించి, 11 జాతీయ రహదారులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గడ్కరీ వెంట ఆయన సహచరులు కిషన్ రెడ్డి, వీకే సింగ్ కూడా ఉన్నారు. వేదిపై గడ్కరీ మాట్లాడుతూ.. అమెరికా రోడ్లకు దీటుగా తెలంగాణ రహదారులను అభివృద్ధి చేస్తామంటూ, ఇప్పటికే తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని కితాబిచ్చారు.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు.. మళ్లీ ఆ ఆప్షన్ అందుబాటులోకి..


‘తెలంగాణ ప్రగతిశీల, సుసంపన్న రాష్ట్రం. ఈ రాష్ట్రం ప్రగతి సాధిస్తే.. భారత్‌ అభివృద్థి చెందినట్లే. ఒక ప్రాంతం ప్రగతి సాధించాలంటే నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్స్‌ ప్రధానం. ఈ వనరులు లేకుండా వ్యవసాయం, పరిశ్రమలకు పెట్టుబడులు రావు. పెట్టుబడులు లేనిదే.. ప్రాంతాల అభివృద్ధి అసాధ్యం. అభివృద్థి లేకపోతే పేదరికాన్ని పోగొట్టలేం. రోడ్లను నిర్మించడమంటే, పేదరికాన్ని పొగొట్టడమే. అందుకే కేంద్రం రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది’అని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. అంతటితో ఆగకుండా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, త్వరలో చేపట్టబోయే రీజనరల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టులపైనా గడ్కరీ ప్రశంసలు కురిపించారు.

Astro Vastu Tips: ఈ ఒక్కటీ మీ ఇంట్లో ఉంటే.. డబ్బు కష్టాలు దూరం.. వాస్తు దోష నివారణ కూడా..


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. అమెరికా రోడ్లకు దీటుగా.. తెలంగాణ రహదారులుఆర్‌ఆర్‌ఆర్‌ శంకుస్థాపనకు వస్తాతెలంగాణ గేమ్‌ చేంజర్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ నిలవనుందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఇప్పటిదాకా జరిగినవన్నీ ట్రైలర్లే అని, అసలు సినిమా ముందుందని, దాంతో తెలంగాణ అభివృద్ది జెట్ స్పీడ్ వేగం అందుకుంటుందన్న గడ్కరీ.. ఆర్ఆర్ఆర్ శంకుస్థాపనకు వస్తాననీ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణల్లో టీబీజేపీ ఏవైతే అంశాలను లేవనెత్తుతున్నదో వాటిని కేంద్ర మంత్రి గడ్కరీ పొగడటంతో వేదికమీదున్న టీఆర్ఎస్ మంత్రులు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

First published:

Tags: Andhra Pradesh, CM KCR, KTR, Nitin Gadkari, Telangana, Ys jagan

ఉత్తమ కథలు