హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big News: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

Big News: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ లో మెట్రో విస్తరణలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు.  రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్లు రూ.6,250 కోట్లతో ఈ పనులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు ఫేజ్ 2 పనులకు కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. భూసేకరణ సమస్యలు లేనందున 3 ఏళ్లలో ఈ పనులను పూర్తి చేయనున్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ లో మెట్రో విస్తరణలో భాగంగా సీఎం కేసీఆర్ (Cm kcr) శుక్రవారం రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు.  రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్లు రూ.6,250 కోట్లతో ఈ పనులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు ఫేజ్ 2 పనులకు కేసీఆర్ (Cm kcr) భూమి పూజ నిర్వహించారు. భూసేకరణ సమస్యలు లేనందున 3 ఏళ్లలో ఈ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ  కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రా రెడ్డి, కేశవరావు, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.  ఈ మెట్రో పనుల్లో భాగంగా మైండ్ స్పేస్ కూడలి నుంచి 0.9 దూరంలో రాయదుర్గం ఎయిర్‌పోర్టు స్టేషన్‌ నిర్మిస్తారు. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు మెట్రో (Airport Metro) ప్రారంభమవుతుంది.

Hyderabad | Metro rail : హైటెక్ సిటీ నుంచి శంషాబాద్‌కి మెట్రోరైల్ .. నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన

ఇక అక్కడి నుంచి బయోడైవర్సిటీ కూడలిలోని రెండు ఫ్లైఓవర్లను దాటుకొని.. నేరుగా ఖాజాగూడ చెరువు పక్క నుంచి వెళ్తుంది. ఖాజాగూడ వద్ద కుడి వైపునకు తిరిగి.. నానక్‌రామ్‌గూడ జంక్షన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పక్క నుంచి నార్సింగి, అప్పా జంక్షన్, రాజేంద్రనగర్, శంషాబాద్, ఎయిర్‌పోర్టు కార్గో మీదుగా.. నేరుగా ఎయిర్‌పోర్టులోకి చేరుకునేలా అలైన్‌మెంట్ రూపొందించారు.

Amit Shah: బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ ..హైదరాబాద్ కు అమిత్ షా, బిఎల్ సంతోష్ రాక..ఎప్పుడంటే?

హైదరాబాద్‌ (Hyderabad)లో ఇప్పుడున్న మెట్రో ఆకాశమార్గంలో ఉన్నాయి. కానీ తొలిసారిగా అండర్‌గ్రౌండ్‌లో రైళ్లు నడవనున్నాయి. ఎయిర్‌పోర్టు సమీపంలో భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 31 కి.మీ. మార్గంలో.. 27.5 కి.మీ. ఆకాశమార్గంలో ఉంటుంది. 1 కి.మీ. భూమార్గంలో అంటే.. రోడ్డు లెవెల్‌లో వెళ్తుంది. మరో 2.5 కి.మీ. మాత్రం అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది.అభివృద్ధి చెందిన ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని స్టేషన్ల లొకేషన్లను ఫిక్స్ చేస్తారు. ఈ మార్గంలో 9 స్టేషన్‌లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో స్కైవాకర్స్ నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న సిటీ మెట్రో 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తున్నాయి. కానీ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ మెట్రో  (Airport Metro) రైల్ గరిష్టంగా 120 కిలో మీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు.

మైండ్‌స్పేస్‌- ఎయిర్‌పోర్టు కారిడార్‌లో 31 కిలోమీటర్ల మార్గంలో కారులో అయితే కనీసం ముప్పావుగంట పడుతుంది. మెట్రోలో అయితే 26 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి నూతన మెట్రో లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లుగానే భవిష్యత్తులోనూ మరిన్ని మార్గాల్లో విస్తరించాలని చూస్తోంది ప్రభుత్వం.

First published:

Tags: Hyderabad, Hyderabad Metro, Hyderabad Metro rail, Metro, Metro Train, Telangana

ఉత్తమ కథలు