CM KCR: తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రెండో డోస్ వ్యాక్సిన్ విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.

  • Share this:
    తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగినవారు దగ్గరలో ఉన్న ప్రభుత్వ వాక్యినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలని కేసీఆర్ సూచించారు. సూపర్ స్ప్రైడర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ నిర్వహించాలని అన్నారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని మంత్రి హరీష్ రావు, వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా నియంత్రణపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వాక్సిన్, లాక్ డౌన్ అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్‌రావు కూడా పాల్గొన్నారు.

    ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కరోనా కట్టడికి ద్విముఖ వ్యుహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు. జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీ సత్పలితాలు ఇస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

    అలాగే కరోనా పరీక్షలను మరింతంగా పెంచాలన్నారు. పీహెచ్‌సీలో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్ల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి అన్ని వైద్య కేంద్రాల్లో కిట్ల సంఖ్య పెంచాలన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు కేసీఆర్ చెప్పారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు బెడ్స్, మందులు సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని అన్నారు. అయినప్పటికీ.. దానిని 5 శాతానికి తగ్గించగలిగినప్పుడే మనం కరోనా మీద విజయం సాధించినవారమౌతామని కేసీఆర్ అన్నారు.

    సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు అధిక‌ సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వారికి సరిపోను వాక్సిన్లను తక్షణమే సరఫరా చేయాల్సిందిగా సంబంధిత వాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాక్స్ ఫోర్సు చైర్మన్ మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ ఒక‌వేళ వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల‌న్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: