CM KCR: గుడ్‌న్యూస్... భూసర్వేపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ఏడాది లోగా భూసర్వేను పూర్తి చేస్తామని శాసన మండలిలో ప్రకటించారు తెలంగాణ సీఎం. భూ సర్వేకు కొంత సమయం పట్టినప్పటికీ.. రైతుల సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయని చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: September 14, 2020, 2:29 PM IST
CM KCR: గుడ్‌న్యూస్... భూసర్వేపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ సీఎం కేసీఆర్
  • Share this:
ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొత్త రెవెన్యూ చట్టం గురించే చర్చ జరుగుతోంది. లంచగొండి వీఆర్వోల పీడ విరగడైందని చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శాసన సభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇవాళ మండలిలో బిల్లులను ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. భూవివాదాలన్నింటికీ ధరణి పోర్టలే పరిష్కారమని ఇది వరకే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. భూసర్వే సమయంలోనే 99శాతం సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఐతే భూసర్వే ఎప్పుడు చేపడతారు? ఎప్పుడు పూర్తవుతుంది? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో కొత్త రెవెన్యూ చట్టంపై శాసనమండలిలో మరింత స్పష్టతనిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.

భూసమస్యలతో దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సీఎం.. ఒక్కపైసా అవినీతికి తావులేని పద్ధతిలో మూడేళ్లు కష్టపడి చట్టానికి రూపకల్పన చేసినట్లు మండలిలో చెప్పారు. కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం ఎమ్మార్వోలకు సైతం లేదని తేల్చి చెప్పారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌, ఆధార్‌, ఫోటోతో సహా అన్ని వివరాలు నమోదు చేస్తేనే ధరణి పోర్టల్‌లో మార్పులకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అంటే భూ యజమాని అనుమతి లేనిదే ఎలాంటి మార్పులకు ఆస్కారం ఉండదని క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కేవలం అరగంటలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే అధునాతన వ్యవస్థ తీసుకొస్తున్నామని ఆయన అన్నారు.


ఏడాది లోగా భూసర్వేను పూర్తి చేస్తామని శాసన మండలిలో ప్రకటించారు తెలంగాణ సీఎం. భూ సర్వేకు కొంత సమయం పట్టినప్పటికీ.. రైతుల సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయని చెప్పుకొచ్చారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూముల కొలతల వివరాలను నమోదు చేస్తామని.. తద్వారా ఎలాంటి గొడవలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. తెలంగాణలో రెవెన్యూ కోర్టులు రద్దు చేశామన్న ఆయన.. వాటి స్థానంలో ఫాస్ట్‌ ట్రాక్‌ ట్రైబ్యునల్‌లు పని చేస్తాయని వెల్లడించారు. భూసర్వేతోనే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని.. కావాలని వివాదాలు పెట్టుకునే వారు కోర్టులకు వెళ్లవచ్చని సీఎం అన్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదని స్పష్టం చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: September 14, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading